"రాధేశ్యామ్"లో దీపికా పదుకునే... నిజమేనా?
దాంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపే వాళ్ళు కూడా లేకపోలేదు. అంతటి ప్రేక్షక అభిమానాన్ని కూడగట్టుకున్నారు రెబల్ స్టార్. అయితే ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుండి వినిపిస్తున్న ఓ తాజా వార్త అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఈ న్యూస్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార దీపిక పదుకునే గెస్ట్ రోల్ చేస్తున్నారట. మొదట ఈ పాత్ర కోసం తెలుగు అగ్ర నటులను అనుకున్నా ఆ తరవాత దీపిక అయితే ఇటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యి సినిమాకి బాగా ప్లస్ అవుతారని ఇలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
దాదాపు పావు గంటకు పైనే ఈమె పాత్ర ఉండనుంది అంటూ టాక్ వినిపిస్తోంది. నిడివి తక్కువే అయినా మూవీని ఒక మలుపు తిప్పే పాత్రలో దీపిక కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వార్తను బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా లీక్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో రాధేశ్యామ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక కనిపించనున్నారా అంటే పూర్తి వివరాలు తెలిసే వరకు వెయిట్ చేయాల్సిందే.