అలా జరిగింది: రేప్‌ చేయబోయాడు.. కాళ్ల మధ్య తన్నా..

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఇటీవల ఓ నటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.. దాడికి గురైన నటి చౌరాసియా ఇప్పుడు కాస్త కోలుకుంది. దుండగుడి దాడిలో కాలు కాస్త దెబ్బ తిన్నది.. ఇప్పుడు కాస్త తేరుకుని.. ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించింది. ఆమె ఏం చెబుతోందంటే..

 

“ సాయంత్రం సమయంలో ప్రతిరోజు కేబిఆర్ పార్క్ లో నేను వాకింగ్ చేస్తాను.. నేను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్ళాను.. పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఒక వ్యక్తి నాపై దాడి చేశాడు.. కేబిఆర్ పార్క్ వద్ద నా పై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేసి డబ్బులు డిమాండ్ చేశాడు. నా పై దాడి చేయడంతో  ముఖం పైనా గాయాలు అయ్యాయి..నా మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడు.. అలాగే నా మొహం పై గుద్దాడు.. అయితే.. నేను.. నాతో డబ్బులు లేవు ఫోన్ పే చేస్తాను నెంబర్ చెప్పమని అడిగాను.. నా ఫోనుతో పాటు డైమండ్ రింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.. డబ్బులు కావాలంటే నేను ఫోన్ పే చేస్తాను కొట్టొద్దు అని కోరాను.. అదే టైం లో నేను రెండు సార్లు 100 కి డయల్ చేసాను.. నేను 100 కి డయల్ చేయడం చూసి నన్ను పొదల్లోకి తోసాడు.. పెద్ద బండరాయి నా తలపై వేయబోయాడు..”


“ నేను పక్కకు తప్పుకుని వాడి ప్రైవేట్ పార్ట్ పై నా కాలితో తన్నాను.. వెంటనే గోడ దూకి తప్పించుకుని రోడ్ పైకి వచ్చాను.. కొంతమంది నా చుట్టూ వచ్చి చేరారు.. అది గమనించి వాడు పారిపోయాడు.. పోలీసులు కూడా వెంటనే వచ్చారు.. నేను అతడిని చూస్తే గుర్తుపడతాను.. బహుశా అతడికి.. 22 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది.. దొంగతనం కోసమే వచ్చినట్టు నాకు అనిపించింది..”


“ నాపై దాడి చేసిన తర్వాత నేను స్పృహ తప్పి పడిపోయాను. అది చూసి.. అతడు నాపై అఘాయిత్యం చేయబోయాడు.. అతడేదో చేయబోతుంటే.. కాస్త స్పృహ వచ్చింది.. అంతే బలం కూడదీసుకుని వాడి కాళ్ల మధ్య తన్నాను.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాను..   ఈ కేసు లో తెలంగాణ పోలీసుల పనితీరు చాలా బాగుంది.” అంటూ చౌరాసియా ఆనాటి సంఘటనను వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: