నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే, ఇప్పటికే బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. అఖండ సినిమా పనులను పూర్తి చేసుకున్న బాలకృష్ణ తాజా గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను ప్రారంభించాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ టాక్ షో కు మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ లుగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ రాగ , రెండోవ ఎపిసోడ్ కు గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని వచ్చాడు.
నానితో ఎన్నో విషయాలను ముచ్చటించిన బాలకృష్ణ, నాని ని నా సినిమాలలో నీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం అని అడగగా... దానికి నాని మీ సినిమాలలో నాకు ఆదిత్య 369 సినిమా అంటే చాలా ఇష్టం అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత బాలకృష్ణ నా సినిమాలలో రాడ్ రంబోలాగా ఏ సినిమాను ఫీలవుతావు..? అని అడిగితే... నాని 'పల్నాటి బ్రహ్మనాయుడు' అని సమాధానమిచ్చాడు. ఇలా నాని చెప్పిన సమాధానానికి బాలకృష్ణ ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు, చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడం వంటి విషయాలు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు అని బాలకృష్ణ సమాధానమిచ్చాడు. ఇలా బాలకృష్ణ, నాని ఇద్దరు కలిసి రెండవ ఎపిసోడ్ ను ఫుల్ జోష్ గా ముందుకు నడిపించారు.