ఒకే కథతో తెరకెక్కిన సినిమాలన్నీ హిట్..అవేంటో ..?

Divya
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో నైనా సినిమా మంచి విజయం సాధించింది అంటే చాలు ఆ సినిమాని కచ్చితంగా వారి వారి భాషల్లో రీమిక్స్ చేయాలని చూస్తూ ఉంటారు ఆ దర్శకనిర్మాతలు. అలా రిమేక్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకే భాషలో ఒకే కథతోనే ఎన్నో సినిమాలను కూడా తెరకెక్కించడం జరిగింది మన దర్శకులు. అలాంటి వాటిలో స్టేట్ రౌడీ, పోకిరి సినిమా ఓకే కథ, దేవదాసు, అర్జున్ రెడ్డి కథ ఒక్కటే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓకే కథనే దాదాపుగా ఏడు సార్లు తెరకెక్కించడం జరిగిందట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఇంతకు ఆ కథ ఏమిటి అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.1988 లో హీరో కృష్ణంరాజు-శరత్ బాబు కలిసి నటించిన చిత్రం ప్రాణ స్నేహితులు. ఇక ఈ సినిమా విడుదలై అప్పట్లోనే ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఈ సినిమా 1979 లో వచ్చిన హిందీ సినిమా"కుడి గర్జ్ "సినిమా నే తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.
ఆ తరువాత ఈ కథనే 1992 లో అన్నమలై పేరుతో తమిళంలో కూడా నిర్మించారు. ఈ సినిమా అక్కడ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ తరువాత ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. అయినా కూడా మన హీరోలు ఈ కథ బాగుండడంతో.. హీరో సుమన్-వెంకటేష్ కలిసి ఈ సినిమాని మళ్లీ తెలుగులో రిమేక్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా రవిరాజా పినిశెట్టి వహించాడు.ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని అందుకుంది.
అలా ఓకే సినిమా కథను దాదాపుగా ఐదు సార్లు తెరకెక్కడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ ఈ అన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: