బెంగపెట్టుకున్న అంజలి.. ఆమె కోరిక తీరేదెలా..?

NAGARJUNA NAKKA
హీరోయిన్ అంజలికి బ్యడ్ టైమ్ నడుస్తోంది. ప్రయత్నించిన ఏ పని కూడా సక్సెస్ ను ఇవ్వడం లేదు. దీంతో అంజలి చాలా డిసప్పాయింట్ లో ఉంది. అవకాశాలు ఒక్కొక్కటిగా కావడం ఆమెను మరింత బాధిస్తోంది. ఒకవేళ అవకాశాలు వచ్చిన అంజలికి తగ్గ క్యారెక్టర్ లు రావకపోవడంతో కొంత అవమానానికి గురవుతోంది. సాటి హీరోయిన్లు బిజీగా ఉంటే.. ఆమె మాత్రం చాలా ఖాళీగా ఉంటోంది. ఐటమ్ సాంగ్స్‌ చేసినా, సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ అయినా అవకాశాలు రావడం లేదు. తెలుగు, తమిళ్ లో రెండు చోట్లా ఇదే పరిస్థితి. దీంతో మళయాళం ఇండస్ట్రీని ఫోకస్‌ చేస్తోంది అంజలి. మరి మాలీవుడ్‌లో అయినా అంజలి బిజీ అవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.

అంజలికి తెలుగులో చాలా రోజులుగా సరైన హిట్‌ లేదు. ఏడేళ్ల క్రితం చేసిన 'గీతాంజలి' తర్వాత అంజలికి పెద్దగా చెప్పుకునే సక్సెస్‌ కూడా రాలేదు. ఇక లాస్ట్‌ మూవీ 'నిశ్శబ్ధం' అయితే అంజలిని విమర్శల్లో పడేసింది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యారెక్టర్‌కి అస్సలు సెట్‌ కాలేదని, లుక్‌ కూడా బాలేదనే కామెంట్స్‌ వచ్చాయి. అంజలిని స్టార్ హీరోలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ లాంటి హీరోలు ఈ బ్యూటీతో సినిమాలు చేసినా, ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. దీంతో సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్ అయింది అంజలి. 'ఎఫ్3'లో ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. అలాగే రామ్ చరణ్, శంకర్‌ సినిమాలో కూడా సపోర్టింగ్‌ రోల్ ప్లే చేస్తోంది.

అంజలికి తమిళ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. అక్కడా హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మళయాళీ ఇండస్ట్రీకి వెళ్లింది అంజలి. అక్కడ నివిన్‌ పాలీతో కలిసి ఒక సినిమా చేస్తోంది. మరి పెర్ఫామెన్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే మళయాళంలో అంజలి ఎలాంటి ప్లేస్‌ సంపాదించుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: