టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో కింగ్ నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను చక చక పూర్తి చేస్తున్న చిత్ర బృందం తాజా షెడ్యూల్ కోసం మైసూర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ను చక చక పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం అనుకోవడానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి మంచి స్పందన లభించింది. ఇక అక్కినేని నాగ చైతన్య కూడా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, అలాగే అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చాద్దా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.