పవన్ కళ్యాణ్ తో పని చేయడంపై.. నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
నిత్య మీనన్.. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోయిన్. ప్రస్తుతం ఎంతో మంది యువ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాదు.. స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రల్లో కూడా నటిస్తోంది. అయితే నిత్యామీనన్ ప్రస్తుతం ఏ పాత్రలో నటించిన కూడా పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే వైవిధ్యమైన పాత్రలు ఉంటే ఇక ఆ పాత్రలో నిత్యామీనన్ ను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవలి కాలంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది.

అయితే అటు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నటిస్తున్న సినిమాలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం.  ఇప్పటికే అయ్యప్పన్ క్రిస్టియన్ అనే తెలుగు రీమేక్ సినిమాలో కూడా నిత్యామీనన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ  సాదారణంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాలంటే కొంతమంది హీరోయిన్లు భయపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అంత పెద్ద హీరోతో ఎలా నడుచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది నిత్యామీనన్. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పై ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ తో పనిచేయడం ఎంతో ఈజీ... ఆయన చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి.. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతిని ఇస్తుంది అంటూ నిత్యామీనన్ పేర్కొంది. ఇక భీమ్లా  నాయక్ సినిమాలో తన పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చింది నిత్యామీనన్. ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: