బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరో. ఆయన హిందీ లో చేసిన పలు డబ్బింగ్ సినిమాలను ఇప్పటిదాకా చేసి తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. మంచి దేహదారుఢ్యం అలాగే అందమైన మొహం అద్భుతమైన నటన అన్నీ కలిపి హృతిక్ రోషన్ బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. దేశంలోని అన్ని భాషలలో ఆయన సినిమాలు రావడానికి అవి కారణం అయ్యాయి. ఏదేమైనా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరూ అమ్మాయిలు వెంట పడే హీరో గా హృతిక్ నిలిచాడని చెప్పవచ్చు.
క్రిష్ సినిమా ద్వారా ఆయన తెలుగులో లో ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ హీరో సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ రేంజిలో అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయన హీరోగా నటించిన కోయి మిల్ గయా చిత్రానికి సీక్వెల్ కాగా అది తెలుగు లో ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులు చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు. అంతేకాదు అప్పటి నుంచి నటించే ప్రతి సినిమాని తెలుగులో విడుదల చేయాలని డిమాండ్ తీసుకు వచ్చారు. ఆ విధంగా ఇప్పటివరకు హృతిక్ రోషన్ తన సినిమాను కూడా తెలుగు లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు
ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలతో పాటు భవిష్యత్తులో నటించబోయే సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతుండటం విశేషం మంచి హీరోగా పేరున్న హృతిక్ భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు దానికి తగ్గట్లే ఆయన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. ఇండియన్ సినిమా పరిశ్రమలో హాలీవుడ్ రేంజ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది హృతిక్రోషన్ అనే చెప్పాలి. మరి సౌత్ ఇండియాలో కూడా మంచి పేరు సంపాదించుకున్న హృతిక్ భవిష్యత్తులో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.