నిర్మాత తో గొడవ పడ్డ ప్రముఖ దర్శకుడు.. కారణం ఇదేనా..?

Divya
ఒక్కోసారి ఆర్టిస్టులకు, నిర్మాతలకు మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. ఇక అలాగే దర్శకుడు, నిర్మాతలకు మధ్య ఏదో విధంగా వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. అవి వారు పరిష్కరించుకోకపోతే.. దానికి విపరీతమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అయినటువంటి గౌతమ్ మీనన్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
గౌతమ్ మీనన్ ను గొడవ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా అన్బుసెల్వన్ అని సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మూవీలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను హీరో విశాల్, డైరెక్టర్ రంజిత్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా పోస్టర్ చూసే వరకు తను ఈ సినిమాలో  నటిస్తున్నాడని తెలియదంటూ తెలియజేశారు గౌతమ్ మీనన్.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ..ఈ సినిమాలో నేను నటించలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ పోస్టర్ లో కనిపిస్తున్న డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అతని నేనెన్నడూ చూడలేదు కలవలేదని కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
దీంతో ఆ సినిమా నిర్మాణ సంస్థ M.M వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను విడుదల చేసింది. అందుకు సంబంధించి వీడియో క్లిప్ ను కూడా రెండు నిమిషాల వ్యవధిలో విడుదల చేశారు. ఆ వీడియోలో వివేక్.. ప్రసన్న తో పాటుగా గౌతమ్ నటించిన కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో విడుదల చేసిన తర్వాత గౌతమ్ మీనన్ ప్రకటనను తప్పు పడుతున్నారు ఆ సంస్థ. ఇటీవల కూడా ట్రాన్స్ అనే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడట. అయితే చిన్న చిన్న సినిమాలలో కూడా అటువంటి పాత్రలు చేయడంలో వెనుకడుగు వేయలేదు అంటూ ఆ సంస్థ తెలుపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: