అలాంటి పాత్రల్లో హీరోలే కాదు హీరోయిన్లు కూడా నెంబరు వన్నే..!!

Divya
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయం అనగానే ముందుగా హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు.. కానీ కాలం మారుతున్న కొద్దీ దర్శకులు అలాగే రచయితలు కూడా హీరోయిన్లకి మంచి కథలను అందిస్తున్నారు. వారిని నెగిటివ్ షేడ్స్ లో చూపించడమే కాకుండా ద్విపాత్రాభినయం లో కూడా చూపిస్తూ మంచి గుర్తింపును తీసుకొస్తున్నారు.. అందుకే హీరోయిన్లు కూడా హీరోలకంటే మేమేం తక్కువ కాదంటూ తమ ధీమాను వ్యక్తం చేయడం గమనార్హం.. ఇకపోతే ఎవరెవరు హీరోయిన్లు ద్విపాత్రాభినయం చేసి మెప్పించారో ఒకసారి చదివి తెలుసుకుందాం..
అనుష్క:
అరుంధతి సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క మంచి ప్రేక్షకాదరణ పొందిడమే కాకుండా ,సినీ ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా లేదు అనేంతగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇప్పటి వరకు ఈ సినిమా కొల్లగొట్టిన కలెక్షన్లు ఈ స్థాయిలో ఏ సినిమా కూడా సాధించలేదనే చెప్పాలి. అనుష్కకు మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత ఆమె మరి కొన్ని సినిమాలలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది.
త్రిష:
మోహిని సినిమాలో త్రిష త్రిపాత్రాభినయం చేసి అందర్నీ బాగా ఆకట్టుకుంది.
ప్రియమణి:
కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో స్టార్ స్టేటస్ ను అనుభవించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి , చారులత సినిమాలో ద్విపాత్రాభినయం చేసి అందరిని బాగా ఆకట్టుకుంది.
కాజల్ అగర్వాల్:
మగధీర సినిమాతో డ్యుయల్ రోల్ చేసింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాతో  రామ్ చరణ్ కు ఇటు కాజల్  కు మంచి పేరు వచ్చింది. అంతేకాదు రామ్ చరణ్ ను ఓవర్ నైట్ లో నే స్టార్ హీరోగా చేసిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఇక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా.
తమన్నా:
హీరో రామ్ నటించిన ఎందుకంటే ప్రేమంట అనే సినిమాలో ద్విపాత్రలో నటించి అందరిని అలరించింది ఈ మిల్క్ బ్యూటీ..
అంజలి:
గీతాంజలి సినిమా ద్వారా ద్విపాత్రాభినయంతో అందరినీ అలరించింది మన తెలుగమ్మాయి అంజలి. ఈ  గీతాంజలి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: