ఆర్ ఆర్ ఆర్ తో రాజీపడుతున్న రాజమౌళి !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభించిన రోజున ఈమూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనేక అంచనాలు వచ్చాయి. దీనికితోడు చరణ్ జూనియర్ ల కాంబినేషన్ తో ఈమూవీకి బిజినెస్ పరంగా కాసుల వర్షం ఖాయం అని అనుకున్నారు అంతా. ఈమూవీ పెట్టుబడి 400 కోట్లకు దాటిపోవడంతో ఈమూవీ బిజినెస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ విడుదల మూడుసార్లు వాయిదా పడి చివరకు వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈమూవీ మార్కెట్ ఓపెన్ కావడంతో అంచనాలకు అనుగుణంగా ఈమూవీ ఫైనల్ బిజినెస్ జరగడం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రెట్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలు ఈమూవీ మార్కెట్ పై ప్రభావాన్ని చూపించి ఆంధ్రా సీడెడ్ బయ్యర్లు ఈమూవీకి మొదట్లో ఒప్పుకున్న రేట్లకు ఇప్పుడు ఫైనల్ గా సెట్ అవుతున్న రేట్లకు 30 శాతం తేడా రావడంతో ఈమూవీ అంచనాలు తప్పుతున్నాయి అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కరోనా థర్డ్ వేవ్ భయాలు దేశాన్ని వదలడం లేదు.

లేటెస్ట్ గా మధ్య ప్రదేశ్ లో ఇండోర్ కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఎవై.4 అనే కొత్త వేరియంట్ వెలుగు చూసింది. ఇప్పుడు ఇది దేశం అంతా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవిషయాలు అన్నీ ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్ల దృష్టికి వెళితే మళ్ళీ ఒప్పుకున్న ఫైనల్ ఫిగర్స్ లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరిగితే ఈ భారీ మూవీ పై ఆశించిన లాభాలు ఏమాత్రం రావు అని జరుగుతున్న ప్రచారం రాజమౌళిని కలవర పెడుతున్నట్లు టాక్. ఈమూవీ పై ఇప్పటికే జక్కన్న మూడు సంవత్సరాల కాలాన్ని పెట్టాడు. ఇలాంటి శ్రమకు రాజమౌళి స్థాయిలో ఈ మూవీ నిర్మాతకు లాభాలు లేకుంటే ఇన్నాళ్ళ శ్రమ వృధా అన్నమాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: