బాలయ్య "అఖండ" కోసం ప్రేక్షకుల పాట్లు... ?

VAMSI
నందమూరి తారక రామారావు తనయుడు నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ కావడం విశేషమే మరి. ఎందుకంటే ఈపాటికే లెజెండ్, సింహ వంటి సూపర్ హిట్ చిత్రాలు వీరి కాంబోలో మన ముందుకు రాగా ఇపుడు అఖండ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు ఈ సూపర్ హిట్ కాంబో.  మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‏గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి గారి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్ లో అఘోర పాత్రలో కనిపించి అబ్బురపరిచారు బాలయ్య.  ఇక బాలయ్య సినిమా అనగానే అందరికీ ఆసక్తి..ఈ వయసులో కూడా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులు , మునపటి సినిమాలకు మించిన స్టెప్పులు చూడటానికే ఎక్కువ మంది ప్రజలు అట్రాక్ట్ అవుతుంటారు. మొదటి నుండి రాయలసీమ నాటు బాంబు లాంటి డైలాగులను పేల్చడంలో బాలయ్య పెట్టింది పేరు. అలాంటిది ఈ మధ్య సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ ను మరింత పెంచడంతో ఫ్యాన్స్ కి పండగే పండగ. ఇక ఇప్పుడు అఖండ చిత్రంలో కూడా ప్రతి సీన్ లోనూ ఓ అదిరిపోయే శక్తి వంతమైన డైలాగు ఉంటుందని తెలుస్తోంది.

మరి ఇంకేముంది ఈ ఒక్క మాట చాలు ప్రేక్షకులు పిట్టల్లా బాలయ్య సినిమా ముందు వాలిపోవడానికి. అంతే కాకుండా ఈ సినిమాలో భారీ ఫైట్స్ పెట్టారట. ఒక్కో ఫైట్ రెండు నిమిషాలకు మించి ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ తో పాటు రిలీజ్ అయిన పాటలు, పోస్టర్లు అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి.  ఈ సినిమాలో సీనియర్ నటులు శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ లు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతా బాగుంది కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందా అని ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు పడరాని పాట్లు పడుతున్నారట బాలయ్య సినిమా కోసం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: