హ్యాపీ డేస్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు హీరో నిఖిల్. ప్రస్తుతం ఆ సినిమా ద్వారా పరిచయమైన నలుగురు హీరోలలో నిఖిల్ ఒక్కడే గట్టిగా నిలబడగలిగాడు అంటే ఆయనకు సినిమా పట్ల ఉన్న శ్రద్ధ జాగ్రత్త ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న యంగ్ హీరోలలో మంచి మార్కెట్ ను కలిగి ఉండి ప్రేక్షకాభిమానాన్ని అందుకున్నాడు హీరో నిఖిల్. ఆయన హీరోగా తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తుండడంతో ఆయన హీరోగా ఇప్పటి వరకు నిలబడ గలిగాడు.
అందరు హీరోలకు వచ్చినట్లుగానే నిఖిల్ కు కూడా మధ్యలో ఓటములు ఎన్నో ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చాయి. అయితే సినిమా ఫలితంతో సమాధానం చెప్పి ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. మధ్య లో మరి కొన్ని వివాదాలు కూడా ఆయనను చుట్టుముట్టాయి. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయం గా ముందుకు వెళ్ళాడు. అర్జున్ సురవరం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకొని భారీ హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాలను చేయడం ఆయన అభిమానులు ఎంతగానో సంతోషానికి గురిచేస్తుంది.
సుకుమార్ నిర్మాణంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు నిఖిల్. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తనకు తప్పకుండా మంచి పేరు తీసుకువస్తుందని భావిస్తున్నాడు నిఖిల్. ఇక ఆయన కెరీర్ లో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు నిఖిల్. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఏక కాలంలో నాలుగు సినిమాలలు చేస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు నిఖిల్. మరి ఆయనకు ఈ సినిమాలలో ఏ రేంజ్ విజయాలు దక్కుతాయో చూడాలి.