ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఐదవ సీజన్ 50 రోజులు పూర్తి కావచ్చింది. ఈ యాభై రోజులు కూడా గేమ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఇక తాజాగా ఏడవ వారం ఎలిమినేషన్ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే అన్ అఫిషియల్ సైట్ ఓటింగ్ లిస్ట్ లో అని మాస్టర్ పేరు ఉన్నా.. అఫీషియల్ గా మాత్రం ప్రియా ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇక్కడే అని మాస్టర్ కి బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన పవర్ కూడా ఇచ్చాడు. సండే ఫండే వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా కొన్ని గేమ్స్ ని ఆడించిన నాగార్జున.. గేమ్ లో గెలిచిన వారికి ఒక ప్రత్యేక మైన పవర్ వస్తుందని పేర్కొన్నాడు.
అయితే ఆ గేమ్ లో విన్ అయి, అనూహ్యంగా ఆనీ మాస్టర్ ఆ పవర్ ని దక్కించుకుంది. నిజానికి ఆనీ మాస్టర్ కి ఆ పవర్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.ఇక ఇదిలా ఉంటే ఆనీ మాస్టర్ కు వచ్చిన ఆ పవర్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ పవర్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యేదా? లేదంటే ఒక వారం ఇమ్యూనిటీ పొందేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలామంది మాత్రం రేస్ టు ఫినాలే కోసం ఆనీ మాస్టర్ కి ఆ పవర్ ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు. అయితే ఆట ఇంకా ఏడు వారాలు మిగిలింది. అప్పుడే రెస్ టూ ఫినాలే టికెట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
c అయితే ఇక్కడే ఆనీ మాస్టర్ ని సేవ్ చేయడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తున్నారా..? అలా అయితే అది ఆనీ మాస్టర్ కి ఒక సూపర్ పవర్ అవుతుందని అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. లేకుంటే ఆనీ మాస్టర్ కి ఎలిమినేషన్ నుంచి తప్పుకునే పవర్ వచ్చినా కూడా సరిపోతుంది. మరి ఆ తర్వాత వారాల్లో ఆనీ మాస్టర్ గేమ్ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. మరోవైపు ప్రియా హౌస్ నుండి వెళ్ళి పోతూ ఆనీ మాస్టర్ ని స్ట్రాంగ్ గా ఉండమని కోరింది. అలాగే అందరికీ మార్కులు కూడా ఇచ్చింది. ఇక ఫైనల్ గా తనకు వచ్చిన పవర్ ని ఉపయోగించుకుని.. ఆనీ మాస్టర్ గేమ్ ఎలా ఎలా ఆడుతుందో చూడాలి...!!