టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన.. కోలీవుడ్ ఖైదీ?

praveen
కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్లో కూడా మంచి పేరు సంపాదించుకున్న హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. యుగానికొక్కడు అనే సినిమాలో నటించిన కార్తీ యుగానికి ఒక్కడు  సినిమాను తెలుగులో కూడా విడుదల చేశాడు. ఇక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మంత్ర ముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి  హిస్టారికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇక మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించింది  దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు హీరో కార్తి.

 ఇక ఆ తర్వాత హీరో కార్తీ నటించిన అన్ని సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మొదలు పెట్టాడు. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా బాగుంటే హీరో కార్తీని బాగా ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్లో కూడా స్టార్ హీరోగా ఎదిగిపోయారు హీరో కార్తి. అయితే ఇటీవలే మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమా తో వచ్చి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఖైదీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న లోకేష్ కనకరాజు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఖైదీ సినిమా మొదలైన నాటి నుంచి చివరి వరకు కూడా ఆ తర్వాత ఏం జరగబోతోంది అనే దాని పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఉంటుంది. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు కూడా కథలో లీనమై పోతాడు అని చెప్పాలి.  అంతలా సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా. ఈ సినిమా స్టోరీలైన్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో కార్తి నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దొరికాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు  దీంతో టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది ఖైదీ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: