డాక్టర్ సినిమాతో శివ కార్తికేయన్ ఖాతాలో రేర్ రికార్డ్..

Purushottham Vinay
ఇక గత సంవత్సరం కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి బాలీవుడ్ సినిమాలు థియేటర్ రిలీజ్ కు సిద్ధమవ్వడం లేదు. ఒకవేళ విడుదల అయినా కాని కేవలం పాతిక నుండి ముప్పై కోట్లు దక్కించుకుంటే చాలు అది గొప్ప విషయం అన్నట్లుగా ఉంది.ఇక అలాంటిది సౌత్ సినిమాలు మాత్రం అలవోకగా వందల కోట్ల వసూళ్లను చాలా ఈజీగా రాబడుతూ ఉన్నాయి. ఇక సౌత్ సినిమా లు ఈమద్య వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ పదుల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతున్నాయి.ఇక కరోనా మహమ్మారి మొదటి వేవ్ తర్వాత కూడా మాస్టర్ సినిమా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుని కొత్త రికార్డు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తర్వాత తమిళ మూవీ డాక్టర్ సినిమా వంద కోట్ల దిశగా ఇప్పుడు పరుగులు తీస్తోంది. వంద కోట్ల వసూళ్లను దక్కించుకోబోతున్న డాక్టర్ సినిమా సౌత్ లోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా చాలా అరుదైన రికార్డును నమోదు చేయబోతుంది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో వంద కోట్లకు చేరువ అయిన మొదటి సినిమా డాక్టర్ కావడం విశేషం.డాక్టర్ సినిమా రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఇక డాక్టర్ సినిమాకు రెండవ వారంలో కూడా భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనేవి నమోదు అయ్యాయి.ఇక అలాగే మరో వీక్ లో ఈ సినిమా ఇరవై కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకోవడం అంత కష్టం ఏమీ కాదు. కాబట్టి కరోనా సెకండ్ వేవ్ తర్వాత వంద కోట్లు దక్కించుకోబోతున్న సినిమా గా డాక్టర్ సినిమా ఎంతో అరుదైన రికార్డు ముంగిట వుంది. ఇక బాలీవుడ్ సినిమాలు కూడా మెల్ల మెల్లగా విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఉత్తరాన ముఖ్యంగా మహారాష్ట్రలో థియేటర్లు మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి.కాబట్టి హిందీ సినిమాలు మళ్ళీ విడుదల అవ్వబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: