పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్ లో సంచలన దర్శకుడు త్రివిక్రమ్ రచయితగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భీమ్లా నాయక్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో రానా మరో హీరో గా నటిస్తుండగా నిత్య మీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ లు ఈ సినిమాలో హీరోయిన్ లు గా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పు తున్నాయి.
రాజకీయాలలో బిజీ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో తక్కువ సీట్లతో దారుణమైన పరాజయాన్ని పొందగా మళ్లీ సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేయాలని నిర్ణయించుకుని వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా తర్వాత భీమ్లా నాయక్ సినిమా చేస్తుండడం పవన్ అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుంది. ఈ సినిమా హైప్ ను పెంచడానికి రోజు రోజుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో కృషి చేస్తున్నారు.
ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు విడుదల అవుతున్న కూడా పవన్ కళ్యాణ్ స్టామినా ఏ మాత్రం తగ్గని రేంజ్లో ఈ చిత్రాన్ని భారీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతగానో సహకరిస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, అలాగే రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్ఆర్ ఆర్ఇంకా మహేష్ బాబు సిని మా సర్కార్ వారి పాట సినిమా కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటి మధ్య రాబోతున్న ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత పవన్ హరి హర వీరమల్లు అలాగే భవదీయుడు భగవద్గీత అనే సినిమాలో నటిస్తున్నాడు.