కొడుకు కోసం పూరీ ఆరాటం.. హీరో లందరితో!!

P.Nishanth Kumar
దర్శకుడిగా పూరి జగన్నాథ్ తనను తాను ఆయన చేసిన రెండు సినిమాలతోనే ఎన్నో సంవత్సరాల క్రితం మే రుజువు చేసుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్ దర్శకుడిగా ఎదిగిన ఆయన పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా నిలదొక్కుకొని ఇప్పుడు తన పూర్వ వైభవం తెచ్చుకొని భారీ భారీ చిత్రాలను చేస్తున్నారు పూరి జగన్నాథ్.  ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ తో కలసి లైగర్ అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ మైక్ టైసన్ నటిస్తుండటం విశేషం. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఆ విధంగా ఇతర హీరోలకు పెద్ద పెద్ద సినిమాలు చేసి వారికి సక్సెస్ ను అందించడం లో పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు కాగా  సొంత వారికి మాత్రం ఆ రేంజ్ లో హిట్ సినిమాలను ఇవ్వలేక పోతున్నాడు పూరి జగన్నాథ్. ఆయన తమ్ముడు సాయిరాం శంకర్ సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం పూర్తి అవుతున్న కూడా ఆయన హీరోగా ఇప్పటి వరకు నిలదొక్కుకోలేక పోయాడు.

 పూరి జగన్నాథ్ లాంటి అన్నయ్య ఉన్నా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం అంటే నిజంగా అది దురదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రొమాంటిక్ సినిమాతో అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తప్పకుండా తన కొడుకు కి విజయం సాధించి పెడుతుందని ఆయన భావిస్తూ ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం కోసం తన హీరోలను వాడుకుంటున్నాడు పూరీ. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ కోసం ప్రభాస్ ను రప్పించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ ను ఆహ్వానిస్తున్నారు. మరి వీరి క్రేజ్ ఈ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: