ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అక్టోబర్ లో దసరా సందర్భంగా పలు సినిమాలు విడుదల కాగా దసరా తర్వాత కూడా కొన్ని క్రేజీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. నవంబర్ నెలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలు విడుదల అవుతుంటే దీపావళి తో సంబంధం లేకుండా సినిమాలను విడుదల చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు. అలా నవంబర్ నెల మొత్తం మంచి మంచి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
అయితే నవంబర్ నెలలో కొన్ని సినిమాలు విడుదల కాకపోవడంతో డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా డిసెంబర్ లో ప్రేక్షకులను కనువిందు చేయడానికి రాబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 17వ తేదీన ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దానికంటే ముందు నాని తన అప్ కమింగ్ సినిమా శ్యామ్ సింగ రాయ్ ను ఆ నెలలోనే విడుదల చేస్తున్నాడు. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే నవంబర్ నెలలో వరుణ్ తేజ్ గని సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నవంబర్ నెలలో ఖాళీగా లేకపోవడంతో డిసెంబర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. రానా కూడా ఎప్పట్నుంచో థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్న విరాటపర్వం సినిమా కూడా ఇదే నెలలో రాబోతుంది. నాగ శౌర్య వరుడు కావలెను సినిమాను డిసెంబర్ లో మంచి రోజు చూసి విడుదల చేయనున్నారట. అలాగే అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కూడా అదే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక జనవరిలో సినిమాల సందడి ఏ రేంజిలో ఉందో అందరికీ తెలిసిందే. నవంబరు డిసెంబరు జనవరి లో ప్రేక్షకులు మునుపెన్నడూ లేని విధంగా భారీ గా సినిమాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.