పూజా క్రేజ్ మామూలుగా లేదుగా... ?

Satya
ఆమె బుట్ట బొమ్మ. అందాల పూలరెమ్మ. ఆమె సినిమాల్లో ఉంటే చాలు ఆమె క్రేజే వేరు. ఆమె లక్ కూడా అలా కలసివచ్చేస్తుంది. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే. ఈ కన్నడ కస్తూరి టాలీవుడ్ లో అడుగు పెడుతూనే హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్నారు.
ఆమె గత ఏడాది అల వైకుంఠపురంలో మూవీ ద్వారా తన సత్తా ఏంటో చూపించారు. ఆ మూవీ విజయంలో బన్నీ పాత్ర, త్రివిక్రమ్ బాధ్యత ఎంత ఉన్నాయో పూజా గ్లామర్ కూడా అంతే ఉన్నాయని చెప్పకతప్పదు. ఇక లేటెస్ట్ గా దసరా బరిలోకి దిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ మూవీలో పూజా హెగ్డే మరో మారు తన అందంతో అభినయంతో కుర్రకారుకు సెగలు పుట్టించారు అనే చెప్పాలి. ఈ మూవీలో అఖిల్ హీరో అయినా పూజా గ్లామరే బాగా జోరు చేసింది అన్న టాక్ అయితే ఉంది.
ఇంకా ముందుకెళ్ళి చెప్పుకోవాలి అంటే అఖిల్ కి తొలి హిట్ రావడం వెనక పూజా కీలక పాత్ర పోషించింది అని అంటున్నారు. మూవీ స్టోరీ కానీ నెరేషన్ కానీ ఒక ఎత్తు అయితే పూజా హీరోయిన్ అన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఆడియన్స్ ని థియేటర్ల దాకా నడిపించింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. హీరోయిన్ తోనే సినిమాలు నడుస్తాయా అన్న వారికి ఈ మూవీ హిట్ ఒక సమాధానం అంటున్నారు. ఈ మూవీలో అఖిల్ బాగా నటించారు. ఇదివరకటి కంటే కూడా ఆయన బాగా పరిణతి చెందాడు.
అయితే దానితో పాటు పూజా హెగ్డే కూడా ఉండడం ఈ మూవీకి కమర్షియల్ గా కలసి వచ్చింది అంటున్నారు. పూజా కాకుండా మరో హీరోయిన్ అయితే మాత్రం ఈ మూవీ కొంత వెనకబడేది అన్న టాక్ కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే బుట్ట బొమ్మ చెప్పకుండానే మరో హిట్ కొట్టేసింది అంటున్నారు. ఆమె కాల్షీట్లు ఉంటే చాలు మూవీ సక్సెస్ అన్న  మాటను మరో మారు కాపాడుకుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి పూజా తెలుగులో ఇపుడు మళ్ళీ స్వీట్ చాయిస్ అయిపోయింది. చిత్రంగా పూజా బాలీవుడ్ వైపు చూస్తోంది కానీ తెలుగు నిర్మాతలు మాత్రం ఆమె కావాలనుకుంటున్నారు. బ్యాచలర్ మూవీతో పూజా మళ్ళీ టాలీవుడ్  ర్యాకింగ్ చేసినా ఆశ్చర్యం లేదన్నదే జనం మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: