టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన మహాసముద్రం సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకుని శర్వా ఈ మహా సముద్రం సినిమా చేయగా శర్వానంద్ ఈ సినిమా తప్పకుండా తనకు గొప్ప విజయాన్ని అందిస్తుందని అనుకున్నారు. కానీ ఆయన అంచనాలకు భిన్నంగా ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా శర్వానంద్ ఆశలు ఆవిరయ్యాయి. ఆర్ఎక్స్ 100 సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు అజయ్ భూపతి.
అయితే తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ హీరోగా మహా సముద్రం సినిమా చేశాడు. ఈ చిత్రం వివిధ రకాల ఎమోషన్స్ తో కూడిన చిత్రంగా నిలిచింది కానీ కమర్షియల్ పరంగా ఈ చిత్రం ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ మరో కథానాయకుడిగా నటించగా అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. మరి హీరోయిన్ గా అను ఇమ్యాన్యుయెల్ కూడా నటించింది. ఏదేమైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శర్వానంద్ విజయం మాత్రం దక్కించుకోకపోవడం ఆయన అభిమానులు ఎంతగానో నిరాశపరుస్తుంది.
శర్వానంద్ కు విజయం వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆయన మహా సముద్రం సినిమా చేయగా అది ఫ్లాప్ కావడంతో మరొక హిట్ కొట్టాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. మంచి ఎమోషన్ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులు అయినా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని శర్వానంద్ వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా హిట్ అవుతుందా అనేది చూడాలి.