హీరోలకే వణుకు పుట్టించిన విలన్.. మరి ఇప్పుడు..?

Divya
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో.. పసివాడి ప్రాణం అనే ఒక మలయాళం సినిమాను రీమేక్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చిరంజీవి కి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి డైరెక్టర్ కోదండ రామిరెడ్డి నిర్వహించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులను సైతం తుడిచేసింది. ఇక ఈ సినిమాలో విజయశాంతి నటన ప్రేక్షకులకు బాగా అబ్బురపరిచాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో బాలనటిగా సుజిత ఫార్మేషన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో విలన్ గా రఘువరణ్ తన విలనిజాన్ని చూపించాడు. వీటన్నిటి నడుమ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్స్ లతో ప్రేక్షకులను మురిపించారు అని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా డ్యాన్స్ అంటే ఇదే అని చూపించిన హీరో ఈయన. 1987వ సంవత్సరంలో విడుదలైన పసివాడి ప్రాణం సినిమా దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విలనిజాన్ని అద్భుతంగా పండించిన వ్యక్తి బాబు ఆంటోని. ఈ నటుడు కేరళ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
ఇక ఈయన చిరంజీవి సినిమా తో మొదలుపెట్టి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక ఈయన తో హీరోలు ఫైట్స్ చేయాలంటే భయపడే వారట. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లో కూడా మార్షల్ నేర్చుకున్నాడు. మొదటిసారిగా మలయాళంలో శిరంబు అనే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇతర భాషలలో సైతం విలన్ గా నటించాడు. దాదాపుగా ఈ నటుడు 160 సినిమాలకు పైగా నటించారు. చివరిగా సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాలో నటించాడు ఈ విలన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: