ఒక్క సినిమా... ముగ్గురి జాతకాలూ మార్చేసింది... ?

Satya

సినిమా అన్నది రీల్ స్టోరీ అనుకుంటారు. కానీ అది రియల్ లైఫ్ ని కూడా మార్చేసే స్టోరీ. సినిమాను తీసిన వారు, చూసిన వారూ కూడా బాగా ప్రభావితం అవుతారు. వారి లైఫ్ లో కూడా ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. అందుకే దాన్ని పవర్ ఫుల్ మీడియా అంటారు.


ఇదిలా ఉంటే అది 1976 ప్రాంతం. అప్పట్లో సీనియర్ హీరోలు ఎన్టీయార్ ఏయన్నార్ జోరు కొంచెం తగ్గుతోంది. క్రిష్ణ, శోభన్ బాబు హిట్లు కొడుతున్నారు. ఇక సీనియర్ డైరెక్టర్లు పక్కకు తొలగి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి వారు ముందుకు వస్తున్నారు. ఇక హీరోయిన్లలో కూడా జమున‌, వాణిశ్రీ లాంటి వారు హవా తగ్గుతోంది. కొత్త వారు వస్తున్నారు. జయప్రద, జయసుధ ఆ టైమ్ లోనే పరిచయం అయ్యారు.


ఇక చిన్న హీరోలకు మంచి స్కోప్ ఉన్న కాలమది. ఒక అయిదారు లక్షలతో మంచి సినిమా తీస్తే లాభాలు వచ్చే సీజనది. కె రాఘవేంద్రరావు ఫస్ట్ మూవీ బాబుని తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత ఆయన చిన్న బడ్జెట్ తో జ్యోతి అనే మూవీ తీయాలనుకున్నారు. ఈ మూవీలో హీరోగా మురళీమోహన్ ని ఎంచుకున్నారు. ఇక హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారుట. ఎందుకంటే అది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ సీనియర్ హీరోయిన్లు అయితే ఓకే కానీ కొత్తదనం ఉండదు. పైగా బడ్జెట్ పర్మిట్ చేయదు.


అలాంటి టైమ్ లో ఆయన మురళీమోహన్ ఇచ్చిన సలహాతో అప్పటికి చిన్న పాత్రలలో నటిస్తున్న జయసుధను పిలిచి మాట్లాడారు. ఆమెను చూసిన తరువాత ఈమే నా సినిమాకు  జ్యోతి అని కూడా ఫిక్స్ అయ్యారు. అలా ఆయన సెలెక్ట్ చేసి తీసిన మూవీయే జ్యోతి. బ్లాక్ అండ్ వైట్ మూవీగా అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ రిలీజ్ తరువాత సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీతో జయసుధ స్టార్ అయింది. రాఘవేంద్రరావు పేరు మారుమోగింది. హీరో మురళీమోహన్ కూడా హీరోగా బాగా నిలబడ్డారు. మొత్తానికి ఒక్క సినిమా కాదు కానీ ముగ్గురి జాతకాలు మార్చేసింది అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: