ఈరోజు దసరా సందర్భంగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. దసరా కానుక గా థియేటర్ల లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు శిరీష్-లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించా రు. గత మూడు సినిమాలుగా అక్కినేని స్థాయి హిట్ అందుకోలేకపోయాడు అఖిల్.
ఈ సినిమాతో తప్పకుడా తన తొలి విజయాన్ని అందుకొని విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. అక్కినేని అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేశాడు. అక్కినే ని వంశం నుంచి వచ్చిన చిన్న వారసుడు అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మిస్ ఫైర్ అయింది.
అక్కినేని వారి ఇమేజ్ ఈ సినిమాకి సెట్ కాకపోవడంతో ఈ సినిమా భారీ ఫ్లాప్ అయింది. దాంతో ఈసారి ఆయన తన రెండో సినిమాను క్లాసికల్ ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కుమార్ తో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా మరింత క్లాస్ సినిమా అయిపోవడం తో ప్రేక్షకులకు పెద్దగా మెప్పించ లేక పోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా తో కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు అఖిల్. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని చెప్పి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేశాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అందరినీ విపరీతంగా అలరించగా ఈ సినిమా వారిని ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి.