తమ్ముడూ పవన్ కల్యాణ్..! మోహన్ బాబు కి టైమ్ వచ్చింది..

Deekshitha Reddy
సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల గురించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. ఇదే వేదికగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించారు. అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే లేపింది. రాజకీయంగానూ కలకలం సృష్టించింది. ఈ క్రమంలో మోహన్ బాబును కూడా పవన్ ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు. ఏపీలో సీఎంగా ఉన్న జగన్.. మీ బంధువే కదా... ఈ టికెట్ల వివాదంపై మీరు మౌనంగా ఉంటే ఎలా..? ప్రశ్నించండి.. పోరాడండి.. లేదంటే మీ విద్యా వ్యవస్థలోకి కూడా జగన్ వచ్చేస్తారంటూ.. మోహన్ బాబుకు బహిరంగంగానే చురకలు అంటించారు పవన్.
అయితే ఈ విషయంపై మోహన్ బాబు కూడా స్పందించారు. బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ఒకలేఖను విడుదల చేశారు. చాలా కాలానికి తనను మెల్లగా రాజకీయాల్లోకి లాగావంటూ పవన్ ను ఉద్దేశించి అన్నారు. అయితే తానిప్పుడు ఏ సమాధానం చెప్పబోనని.. మా అసోసియేషన్ ఎన్నికల అనంతరం మాత్రమే స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు మంచు విష్ణుకు ఓటేయాలని కూడా ఆ లేఖలోనే రాసుకొచ్చారు మోహన్ బాబు. అయితే ఇప్పుడు మా ఎన్నికలు పూర్తయ్యాయి. కనీసం ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందిస్తారా.. లేదా..? అనేది అసలు ప్రశ్న.
అయితే రాజకీయపరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మోహన్ బాబు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే మోహన్ బాబు మొదటి నుంచి దూకుడు ప్రదర్శించే వ్యక్తిత్వం.. ఎవరైనా ఏమన్నా అనగానే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చేసే స్వభావం మోహన్ బాబుది. అలాంటి మోహన్ బాబు, ఇన్నిరోజులైనా సైలెంట్ గా ఉన్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి వుండాలి. లేదంటే అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోవడం ఎందుకని మౌనంగానైనా ఉండిపోయి ఉండాలి. మా ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తో మోహన్ బాబు సరదాగా మాట్లాడుతూనే కనిపించారు. సో.. పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ లేనట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: