ప్రకాశ్‌రాజ్ ఓటమి.. నాగబాబు ఓటమా.. చిరు ఓటమా..?
సినీ పరిశ్రమలోని కొన్ని పెద్ద కుటుంబాలను ఎదిరించేందుకు వచ్చిన ఓ అవకాశాన్ని చిరంజీవి ఉపయోగించుకోలేదని కొందరు అంటున్నారు. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ అయినా.. నిజజీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారని అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఓ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. అలాంటి టాలీవుడ్‌లో ఆ సామాజిక వర్గానికి చెందకపోయినా ఒంటరిగా స్వశక్తితో పైకొచ్చారు చిరంజీవి. కానీ.. ఆయన రాజకీయంగా ఒకస్థాయి అందుకోలేకపోయేందుకు ఈ వైఖరే కారణమంటున్నారు.
ఈరోజు టాలీవుడ్‌ను ఏలుతున్న నాల్గు కుటుంబాల్లో మూడు ఓ సామాజిక వర్గానికి, మరొకటి మరో సామాజిక వర్గానికి చెందినవన్న సంగతి తెలిసిందే. కీలక సామాజిక వర్గం ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టే ఆలోచన చిరంజీవి చేసి ఉంటే.. తాను ప్రకాష్ రాజ్ నాయకత్వాన్ని బలపరిచి ఉంటే.. ఆ సంగతి బహిరంగంగా ప్రకటిస్తే బావుండేదని కొందరు వాదిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గెలిచే విధంగా ప్రణాళిక రచించి దానికి శ్రమిస్తే తగిన ఫలితం వచ్చేదని విశ్లేషిస్తున్నారు.
కానీ.. నాగబాబు ప్రకాశ్ రాజ్‌కు ఫుల్ సపోర్ట్ చేసినా.. చిరంజీవి మాత్రం తటస్థంగా ఉన్నట్టు ప్రవర్తించడం వల్ల పోటీ కుల బలంలేని ప్రకాష్ రాజ్ కీ, కులం బలమున్న విష్ణుకీ మధ్య అన్నట్టు పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీలోని కీలక సామాజిక వర్గమంతా కూడబలుక్కొని తమ వాడినే గెలిపించుకున్నారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అందుకే ప్రకాశ్‌రాజ్ ఓటమిని తన ఓటమిగా భావించి నాగబాబు రాజీనామా చేశారు.