ఆ విషయంలో తనని లాగొద్దంటున్నా సిద్ధార్థ్...!

murali krishna
" data-original-embed="" >
నువ్వొస్తానంటే నెనొద్దంటానా చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు సిద్దార్థ్‌. ఈ సినిమాతో తెలుగు హీరోలకు సైతం పోటీనిచ్చాడని తెలుస్తుంది.
ఇక అనంతరం వచ్చిన బొమ్మరిళ్లుతో లవర్ బాయ్‌గా మారాడని సమాచారం. అయితే ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమాలు పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని తెలుస్తుంది.. దీంతో ఓ మై ఫ్రెండ్ తర్వాత సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయలేదని అందరికి తెలుసు. అప్పుడప్పుడు ఆయన నటించిన తమిళ సినిమాలే తెలుగులో డబ్ అయ్యి విడదలయ్యాయని తెలుస్తుంది.
అయితే తాజాగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సిద్దార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకకులను పలకరించబోతున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అయిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహాసముద్రంతో తెలుగులో మళ్ళీ నటిస్తున్నాడు నటుడు సిద్దార్థ్‌. ఈ ఇంటెన్స్‌ ప్రేమ కథాచిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సిద్ధార్థ్‌ సమంత, నాగచైతన్యల ఇష్యూ గురించి కూడా ప్రస్తావించారని సమాచారం. నాగచైతన్య - సమంత విషయంలోకి తనని లాగొద్దని చెప్పారని సమాచారం.ఆ సమయంలో తాను చేసిన ట్వీట్‌ అంతగా ఎందుకు వైరల్‌ అయిందో కూడా తనకు తెలియదన్నారట సిద్దార్థ్.
"మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.మరి మీరేం నేర్చుకున్నారు..? "అని ఆయన ట్వీట్ చేసారని అందరికి తెలుసు. అయితే అందరు ఆ ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది. ఎవరి గురించో తాను ఆ ట్వీట్‌ చేయలేదని ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దని సిద్ధార్థ్‌ వివరించారని సమాచారం. తాను చిన్నప్పటి నుంచి బుక్స్ చదివానని అలాగే చాలా నేర్చుకున్నానని.. టీచర్ దగ్గర నేర్చుకున్న విషయమే తాను చెప్పినట్లు సిద్దార్థ్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 2న తాము విడిపోతున్నట్లు సమంత, నాగచైతన్య ప్రకటించిన విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే అదే రోజున సిద్దార్థ్‌ ఈ ట్వీట్‌ చేయడంతో అందరు సమంత గురించే ట్వీట్‌ చేశాడని అనుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: