ఇటీవల కాలంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో విక్రమార్కుడు సినిమా లాంటి కథను తయారు చేశాం అని చెప్పడంతో అందరూ విక్రమార్కుడు తయారు చేశాము అనే అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడు రవితేజ మాత్రమే హీరోగా నటిస్తాడు అని చాలా వార్తలు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో చాలా భాషలలో ఈ సినిమా రీమేక్ కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ ఆలోచన రావడం రవితేజ అభిమానులను ఎంతగానో సంతోషపెట్టే వార్త అయ్యింది. ఈ నేపథ్యంలోనే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం నిర్మాత ను వెతుకుతున్నారని ఈ సినిమాను త్వరలోనే తెరకెక్కించాలని చూస్తున్నాను అని అన్నాడు. దాంతో ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడం లేదు అనే విషయం క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ కూడా ఈ సినిమాలో నటించడం లేదు అనే విషయం తెలుస్తుంది.
ఈ సినిమాకి హీరో దర్శకుడు మారితే అది విక్రమార్కుడు ఎలా అవుతుందని అంటున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఒకవేళ వారే లేకపోతే దానికి వేరే టైటిల్ పెట్టుకోవాలి కా నీ ఈ టైటిల్ పెట్టి లాభమేంటి అని కూడా అంటున్నారు. మరి కథలో ఏమైనా మార్పులు చేసి హీరో ను మారుస్తారా లేదంటే రవితేజ నే హీరోగా చేయిస్తారా అనేది చూడాలి. దర్శకుడు లేకపోయినా పెద్దగా పర్వాలేదు ఎందుకంటే ఆయన తెర మీద కనిపించే వ్యక్తి కాదు. కానీ హీరో మారితే అది విక్రమార్కుడు సీక్వెల్ అవ్వదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. మరి దీనిపై మరింత క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. విజయేంద్ర వర్మ ఎప్పుడు ఇస్తాడో మరీ..