సినిమా ఇండస్ట్రీలో రూమర్లు కామన్. ఒక ఇష్యూ జరిగిందంటే చాలు దానిపై వందల రూమర్లు వస్తుంటాయి. అందులో ఏది నిజమో తెలిసేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి అలా డ్యామేజ్ జరగకముందే నటీనటులు మేల్కుంటే ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. తాజాగా టాలీవుడ్ బ్యూటీ రాశీకన్నాక పై కూడా కొన్ని రూమర్లు వస్తున్నాయి. ఇటీవల ఓ టాలీవుడ్ జంట విడిపోగా ఆ హీరోతో రాశీకన్నా రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు తన సమాధానంతో రాశీకన్నా చెక్ పెట్టేసింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే రాశీకన్నా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో లైవ్ లు పెట్టడం...ఆస్క్ మీ అంటూ ప్రశ్నలు అడించుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాశీఖన్నా తాజాగా ప్రశ్నలు అడగండంటూ నెటిజన్లకు బంపరాఫర్ ఇచ్చింది.
కాగా ఓ నెటిజన్ రాశీఖన్నా మీరు ప్రేమలో ఉన్నారా..? ఎవరితో నైనా డేటింగ్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నలు విసిరాడు. ఆ ప్రశ్నకు రాశీఖన్నా తాను ఎవరితో లవ్ లో లేనని..అంతే కాకుండా తాను సింగిల్ గా నే ఉన్నా అని ఎవరితో అయినా ప్రేమలో పడితే మీకే ముందుగా చెబుతానంటూ క్లారిటీ ఇచ్చేసింది. అలా తనపై వస్తున్న రూమర్లకు రాశీఖన్నా పులిస్టాప్ పెట్టేసింది. అంతే కాకుండా ఓ నెటిజన్ ఇష్టమైన ఫుడ్ ఏంటని అడగ్గా...చోలే బత్యూర్ మరియు సమోసా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పకొచ్చింది.
ఇక మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా..నా ఫేవరెట్ హీరోలు ఎన్టీఆర్..మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా సమంత మరియు అనుష్క శెట్టి ఇద్దరూ తనకు ఇష్టమేనని చెప్పింది. అల్లు అర్జున్ గొప్ప నటుడు కాకపోవచ్చని కానీ గొప్ప డ్యాన్సర్ అని అతడితో ఒక్కసారైనా నటించాలని ఉందని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రాశీఖన్నా నటించిన బ్రహ్మం మలయాల సినిమా త్వరలోనే విడుదల కావాల్సి ఉంది.