నాట్య మయూరిగా చెరగని ముద్ర వేసుకున్న సుధాచంద్రన్..!!

N.ANJI
చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటులు పరిచయం అవుతారు. అందరు ఇండస్ట్రీలో ఎన్నో ఓడిదుకులను ఎదుర్కొని స్టార్ రేంజ్ కి ఎదుగుతారు. ఆలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ సుధాచంద్రన్‌ ఒక్కరు. ఆమె జీవితం ఆధారంగా వచ్చిన సినిమా మయూరి. ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విదితమే.
ఈ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించారు. అయితే ఈ చిత్రంలో సుధాచంద్రనే హీరోయిన్‌గా నటించగా.. శుభాకర్‌ కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమాతో సుధాచంద్రన్‌ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకొని, మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. కాగా.. ఈ సినిమా విడుదలై 36 ఏళ్లయినా ఆమెను ‘మయూరి’గానే ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆ సినిమా తెలుగువారిని ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ‘‘మయూరి’ సినిమా తర్వాత దక్షిణాదితో పాటు బాలీవుడ్‌, భోజ్‌పురిలోనూ చాలా చిత్రాల్లో నటించింది సుధా. కాగా.. ఇప్పటికీ నేను కనిపిస్తే ‘మీరు మయూరి’ కదా.. అంటూ ప్రేక్షకులు గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక సుధాచంద్రన్‌గా కంటే మయూరిగానే వారికి అంతగా దగ్గరయ్యానని ఆమె అన్నారు. ఈ సినిమా విడుదలై తర్వాత నేనూ, శుభాకర్‌ (మయూరి హీరో) ఓసారి గుంటూరులో ఫంక్షన్‌కు వెళ్లామని తెలిపారు.
ఇక వారు స్టేజ్‌పై ఉన్న సమయంలో ప్రేక్షకుల్లో నుంచి ఓ వ్యక్తి శుభాకర్‌పైకి చెప్పు విసిరాడని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. ‘మీరే కదా.. మయూరిని బాధపెట్టింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారంట. దానికి ఆయన నేను శుభాకర్‌ని‌... ఆ సినిమాలో మాత్రమే అలా నటించానని చెప్పుకొచ్చారంట. అంతేకాక.. నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదు’ అని శుభాకర్‌ తెలిపారంట. ప్రస్తుతం సుధ చంద్రన్ బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: