నిన్నే పెళ్లాడుతా : పండు పిల్ల‌కు పాతికేళ్లు!

RATNA KISHORE

గ్రీకు వీరుడు ఎలా ఉంటాడు.. ఈ రాకుమారి ఎవ‌రు.. పెద్ద‌ల పంతాలూ పట్టింపుల నుంచి మ‌హాల‌క్ష్మి (పండు) ఎలా బ‌య‌ట‌ప‌డిం ది. అన్న‌వి చాలా తెలిసిన విష‌యాలు కానీ చాలా బాగా చెప్పాడు. బాగా తీశాడు కూడా! సినిమాలో ఉన్న నిజాయితీ అంతా కృష్ణ వంశీది..గ్లామ‌ర్ వ‌ర‌కూ మాత్ర‌మే ట‌బు.. అడిష‌నల్ వాల్యూ నాగార్జున చేసే రొమాన్స్.. వీటితో పాటు పాత సినిమాల్లో ఉన్న అనుబంధాలు.. వెన్నెల రాత్రులు.. ప్రేమ క‌బుర్లు.. తోడు ఒక‌రుంటే జీవితం ఎందుకు వేడుక అవుతుందో చెప్పిన ప్ర‌త్యేకం అయిన సంద‌ర్భాలు.. సింపుల్ ల‌వ్ స్టోరీ..  నాగార్జున అప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని సినిమా ఏం కాదు కానీ చేసిన సినిమానే కానీ కొత్త పంథా..!




అప్ప‌టిదాకా రామూ ప్ర‌భావంలో ఉన్నాడు అత‌డు. రామూ అంటే ఆర్జీవీ. ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓ సినిమా చేయాలి. త‌న‌ని తాను నిరూపించుకోవాలి. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ మంచి సినిమా ఉండాలి. కెరియ‌ర్ స్టార్టింగ్ లోనే పెద్ద హీరోతో సినిమా, కెరియ‌ర్ స్టార్టింగ్ లోనే పెద్ద బ్యాన‌ర్ లో సినిమా.. ట‌బు, నాగార్జున ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. సినిమా స్థాయిని పెంచే సంగీతం ఇంకా అదిరిపోయింది. సందీప్ చౌతా సంగీతం, సిరివెన్నెల రాసిన పాట‌లు ఇవ‌న్నీ ఈ సినిమాకు అద‌న‌పు బ‌లం.


పాతికేళ్ల త‌రువాత కూడా ఓ సినిమా ఉంటుంది. ఎటో వెళ్లి పోయింది మ‌న‌సు అన్న పాట కూడా ఉంటుంది. అచ్చంగా ప్రేమించు కున్న శ్రీ‌ను గాడు, పండు పిల్ల ఉంటారు. కాలం వారిని వ‌దిలి వెళ్లిపోదు. కాలం మ‌న‌ల్ని ఆ సినిమా నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌దు కూడా! కుటుంబ క‌థ‌ల‌కు కొన్ని భావోద్వేగాలు ఎంత అవ‌స‌ర‌మో చెప్పి నిరూపించిన సినిమా ఇది. కృష్ణ వంశీ ఏం చెప్పి మెప్పించాడో కానీ మ‌ళ్లీ ఇలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేయ‌లేక‌పోయాడు కూడా!


మంచి సినిమా అన్న నిర్వ‌చ‌నం, ప‌రిధి దాటి అంద‌రూ ఆలోచించాల్సిన సినిమా అన్న నిర్ణ‌యానికి తీసుకువచ్చిందా చిత్రం. కు టుంబ బంధాలు, భావోద్వేగాలు అన్నీ ఎక్క‌డికి పోవు, వాటిని కాల‌మే ప‌దిలంగా ఉంచుతుంది అని కూడా చెప్పిన చిత్రం. నాగార్జున సినిమా కెరియ‌ర్ ను మ‌లుపు తిప్పిన సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. నిన్నేపెళ్లాడ‌తా పాతికేళ్ల పండుగ. పాతికేళ్లుగా ఓ సిని మాను స్మ‌రించేలా చేసిన పండుగ. కృష్ణ వంశీని డైరెక్ట‌ర్ గా నిల‌బెట్టిన సినిమా. అప్ప‌టిదాకా ఉన్న కొన్ని ఫార్ములా క‌థ‌ల‌తోనే ఎలా ట్రెండ్ సెట్ చేయ‌వ‌చ్చో నిరూపించిన సినిమా కూడా ఇదే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: