సమంత పెళ్లి వేడుకలో కట్టిన చీర ఎవరిదో తెలుసా..?

Divya
సమంత - నాగ చైతన్య.. వీరిని 2009 లో ఏం మాయ చేసావో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా ఒకరికొకరు పరిచయం అయి ఆరోజు నుంచి నేటి వరకు కూడా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి కాకముందు వరకు లవ్ లో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అంటూ విమర్శలకు చోటిచ్చారు.. ఇక పెళ్లయిన తర్వాత మంచి గుర్తింపు పొంది, అందరి చేత శభాష్ అనిపించుకుంటూ జోడీ అంటే ఇలాగే ఉండాలి అని ప్రశంసలు కూడా అందుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తిరిగి విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలతో అందరి ముందు నిలవడమే కాకుండా అభిమానులను కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అన్ని వార్తలకు తెరదించుతూ అధికారికంగా విడాకులు తీసుకుంటున్నామని తేల్చి చెప్పేశారు.. నిన్న సాయంత్రం వైవాహిక బంధానికి దూరమవుతూ.. స్నేహ బంధానికి చిరకాలం విలువ ఇస్తాము అని చెప్పడంతో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు.
సమంత, నాగచైతన్య అంగరంగ వైభవంగా రెండు మతాల ఆధారంగా రెండు సార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే సమంత తన పెళ్లి రోజున ధరించిన చీర అక్కినేని ఫ్యామిలీ వాళ్లకు చాలా ప్రత్యేకత అది ఎందుకో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ముఖ్యంగా సమంత - నాగ చైతన్య  నిశ్చితార్థ వేడుకలతో పాటు పెళ్లి వేడుకల్లో కూడా  సమంత ధరించిన చీరల విషయంలో అక్కినేని ఫ్యామిలీ చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నిశ్చితార్థం రోజున ఈ ముద్దుగుమ్మ కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌  నాగచైతన్యతో సమంతకు పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు,  నిశ్చితార్థం ఇలా అన్ని సందర్భాలను, అలాగే వారి మధ్య జరిగిన అందమైన అనుభూతులను అన్నింటినీ కూడా చక్కటి బొమ్మల రూపంలో చీరపై డిజైన్ చేశారు..

ఇక వీరి పెళ్లికి కూడా క్రేశా బజాజ్‌.. ఒక ప్రత్యేకమైన  చీర ను , లెహంగాను కూడా  డిజైన్ చేశారు. అయితే పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర ఎవరిదంటే..నాగ చైతన్య అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే ప్రముఖ నిర్మాత విక్టరీ వెంకటేష్ తండ్రి రామనాయుడి భార్యది. ఆ చీరను చాలా ప్రత్యేకంగా  రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత ధరించింది.ఇలా చేయడం కోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని సమాచారం. మరోవైపు పెళ్లి వేడుకలో సమంత ధరించిన జ్యూవెల్లరీకి సంబంధించి కూడా అప్పట్లో చాలా ఖర్చు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: