తగ్గేదే లే అంటూ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గిన అల్లు అర్జున్ !

Seetha Sailaja

అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసి నటిస్తున్న ‘పుష్ప’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డులను దృష్టిలో పెట్టుకుని ఈమూవీతో బన్నీ నేషనల్ సెలెబ్రెటీగా మారడం ఖాయం అని బన్నీ అభిమానులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు.


ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో బన్నీ ‘తగ్గేదేలే’ అంటూ చెప్పిన డైలాగ్ కు అతడి అభిమానులు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. వాస్తవానికి ఈమూవీ క్రిస్మస్ రోజున విడుదల అవుతుంది అంటూ ఇప్పటివరకు ప్రకటన ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈమూవీని ఒక వారం ముందుకు తీసుకు వచ్చి డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించింది.


వాస్తవానికి అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో ‘పుష్ప’ విడుదల అవుతుందని ఇప్పటివరకు అందరు భావించడంతో నేషనల్ సెలెబ్రెటీ అమీర్ ఖాన్ తో పోటీపడే స్టామినా అల్లు అర్జున్ కు ఉందా అంటూ ఇప్పటికే బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తూ వచ్చింది. దీనితో సుకుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తన ‘పుష్ప’ ను అమీర్ ఖాన్ తో జరగబోయే పోటీ నుండి తప్పించి 17న సినిమాను రిలీజ్ చేస్తే ‘పుష్ప’ పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా వీకెండ్లో వసూళ్ల వర్షం కురుస్తుందని సుకుమార్ అంచనా.


రెండో వారం క్రిస్మస్ సెలవులు కలిసివస్తాయి కాబట్టి అప్పుడు కూడ ‘పుష్ప’ కలక్షన్స్ లో డ్రాప్ ఉండదని ఆతరువాత వచ్చే జనవరి 1వరకు ‘పుష్ప’ హవా కొనసాగుతుందని సుకుమార్ అంచనా అని అంటున్నారు. దీనితో ‘పుష్ప’ టీమ్ తెలివిగా ప్రవర్తించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈమూవీకి సంబంధించిన పనులు అన్నీ పూర్తి చేసి నవంబర్ నెలాఖరు నుండి ‘పుష్ప’ ప్రమోషన్ ను చాల ముందుగా బాలీవుడ్ లో మొదలుపెట్టాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: