వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ నడిచిందా..?
నాగార్జున హీరోగా సూపర్ సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుష్క. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు యోగా టీచర్ గా పని చేసిన విషయం తెలిసిందే. కానీ సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన తో పూరి జగన్నాథ్ తో కలిసి సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది..కానీ ఈమెకు నటన నేర్పించడానికి ఏకంగా ఆరు నెలల పాటు నాగార్జున, పూరిజగన్నాథ్ కష్టాలు పడ్డారట. ఇక అలా ఆరు నెలలపాటు నాగార్జున , అనుష్కకు నటనలో ప్రావీణ్యం పొందేలా చేశారు.
ఇక ఈ సహాయంతోనే నాగార్జున కొడుకులైన అఖిల్ కు, నాగచైతన్యకు కొన్నిరోజులపాటు అనుష్క యోగా కూడా నేర్పించింది. ఇక తర్వాత నాగార్జున పై ఆమెకు ఇష్టం పెరిగి వరుసగా నాగార్జునతో ఒక ఐదు నుంచి ఆరు సినిమాల్లో నటించింది.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కానీ నాగార్జున, అనుష్క మీద ఇష్టంతోనే ..నాగార్జున కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త తో, అనుష్క కి వివాహం జరిపించాలని కూడా చూశాడని వార్తలు వచ్చాయి.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. నాగార్జున మాత్రం అనుష్కకు ఒక మంచి మిత్రుడు అని మాత్రమే చెప్పగలను.