బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

Anilkumar
బుల్లితెర బిగ్ బాస్ సీజన్ 5 కి రోజు రోజుకి మంచి ప్రేక్షకాదరణ పెరిగిపోతోంది. ఇక ప్రస్తుతం 17 మంది హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ షో కొనసాగుతోంది. అయితే బిగ్ నాస్4లో నామినేషన్స్ ఎంత రసవత్తరంగా ఉంటాయో..ఎలిమినేషన్స్ కూడా అంతకుమించి సాగుతాయి.ఇక వారాలు గడుస్తున్నా కొద్ది హౌస్ మేట్స్  మధ్య బాండింగ్ అనేది ఏర్పడు.కాబట్టి ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి వస్తుంది.ఇక ఫస్ట్ వీక్ లో సరయు వెళ్లిపోతుంటే విశ్వ ఎంతో బాధపడ్డాడు.అలాగే రెండో వారం కూడా ఉమాదేవి ఎలిమినెట్ అయి.. బయటికి వెల్లుపోయింది.ఇక ఇప్పుడు మూడో వారం హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్లబోతున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే..ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు.ఇక ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు ఈసారి ఎలిమినెట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఇక మేల్ కంటెస్టెంట్స్ అయిన మానస్ అండ్ శ్రీరామ చంద్ర ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు.ముఖ్యంగా మానస్ మాత్రం పలు అన్ అఫీషియల్ సైట్స్ లో టాప్ ప్లస్ లో ఉన్నాడని సమాచారం.ఇక ఈ వారం ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోతారు అనేది ఆసక్తిగా మారింది.ఆ ముగ్గురే ప్రియాంక సీంగ్, లహరి,ప్రియ.ఇక ఈ ముగ్గురిలో ప్రియాంక సింగ్ తో పోలిస్తే ప్రియ ఓటింగ్ పరంగా కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్రియాంక సింగ్ కి కూడా బయట అభిమానులు బాగానే ఓట్లు వేస్తున్నారు.మిస్ కాల్స్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో వెనకబడింది మాత్రం లహరి అనే చెప్పాలి.అయితే ఓటింగ్ లెక్కల ప్రకారం చూసుకున్నట్లైతే ఈసారి లహరి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఎక్కడ చూసినా లహరి లీస్ట్ పొజిషన్ లోనే కన్పిస్తుంది. అందుకే ఈవారం లహరి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఒకవేళ ఈ వారం కనుక ఎలిమినేషన్ లేకపోతే లహరి సేఫ్ అయినట్టే.ఏం జరుగుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: