
బిగ్ బాస్ ఉమాదేవి గొప్ప మనసు.. ఏం చేసిందో తెలుసా?
ఇలా సోను సూద్ మాత్రమే కాదు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు గొప్ప మనసు చాటుకున్నారు. ఇక ప్రేక్షకులు సినీ సెలబ్రిటీల గురించి పెట్టుకుని ఒక భావన సరైనది కాదు అని తమ గొప్ప మనసుతో రుజువు చేశారు. ఇక ఇటీవలే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీరియల్ నటి ఉమాదేవి కూడా గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తరచూ కంటెస్టెంట్స్ తో గొడవలు పడుతూ.. కొన్నిసార్లు బూతులు మాట్లాడటం కూడా చేసింది ఉమాదేవి. దీంతో కొంతమంది సినీ ప్రేక్షకుల్లో ఉమాదేవి అంటే మంచిది కాదేమో అన్న భావన వచ్చింది. కానీ ఇప్పుడు ఉమాదేవి చేసిన పని తెలిస్తే మాత్రం చేతులెత్తి మొక్కుతారు.
ఇటీవలే రెండో వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఉమాదేవి తన రెమ్యునరేషన్ను ఒక మంచి పని కోసం ఉపయోగించింది బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పారితోషికం లోని కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి ఆదుకునేందుకు సాయం చేసింది ఉమాదేవి. ఇక ఇప్పుడు బిగ్బాస్ ఫేమ్ ఉమాదేవి గొప్ప మనసు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ షోలో భాగంగా మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. ఇక రెండవ వారంలో తక్కువ ఓట్లు రావడంతో ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది అనే విషయం తెలిసిందే.