ల‌వ్ స్టోరీ లీక్స్ : శేఖ‌ర్ జీవితంలో అనూహ్య మార్పు!

RATNA KISHORE
క‌థేంటి .. చాలా సింపుల్ లైన్.. ఒక అమ్మాయి జీవితంలో వ‌చ్చే మార్పులు ఓ ప్ర‌మాదం కార‌ణంగా ఆమె జీవితం ఏ విధంగా మార్పు చెందిందో చెప్పే సంద‌ర్భం స‌ర్ .. ఆ త‌రువాత వచ్చే స‌న్నివేశాల్లో వాన..వాన‌తో వ‌చ్చే అనుబంధాలు, జ్ఞాప‌కాలు ఇవీ ఉన్నాయి మీరు పాట రాయాలి.. రాస్తాను..వేటూరి స‌ర్ అన్నారు.. వ‌చ్చే వ‌చ్చే న‌ల్ల మ‌బ్బుల్లారా..అంటూ శ్రావ‌ణ మాసాన జ‌ల త‌రంగాలు గురించి జీవ‌నా వేదాన వినిపించు మృంద‌గ ధ్వ‌నులు గురించి ఎంతో గొప్ప‌గా రాశారు. అప్పుడు కూడా ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు. పాట గొప్ప‌గా వ‌చ్చింది. అలాంటి శేఖ‌ర్ ను ఇవాళ కార్పొరేట్ కంపెనీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. గొప్ప స‌క్సెస్ ను
ఇవ్వ‌మ‌ని అడుగుతున్నాయి.




ఆనంద్ సినిమా తీస్తున్న రోజుల‌వి. తాను రాసుకున్న క‌థ‌కు నిర్మాతలు లేరు. పెద్ద పెద్ద బ్యాన‌ర్లూ లేవు. త‌న‌ని తాను న‌మ్ముకు న్నాడు శేఖ‌ర్. అప్పుడు ఇప్పుడూ బ‌క్క చిక్కిన పోర‌డు. చిరంజీవి అభిమాని. శేఖ‌ర్ ను చూస్తే ముందు ఆయ‌న న‌వ్వు గుర్తుకు వ‌స్తుంది. త‌రువాతే ఆయ‌న. పొడ‌గ‌రి.. స‌న్న‌గా రివ‌ట‌లా ఉంటాడు. నేను ఆయ‌నతో మాట్లాడుతున్నంత సేపు ఎంత ఆనందిం చానో అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఒక అభిమానికి కానుక‌గా ఆయ‌న వ‌చ్చి మొన్న‌టి ఫంక్ష‌న్ లో మాట్లాడారు. ఆయ‌నే కాదు  ఇప్పుడు ప్ర‌భాస్, ధ‌నుష్  ఇలా అంతా ఆయ‌న వెంట ఉంటున్నారు. ఒక రోజు ఆయ‌న సినిమా విడుద‌ల‌కే నోచుకోలేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో నాలుగో ఐదో థియేట‌ర్ల‌లో న‌డిస్తే చాలు అనుకున్నాడు. ఆయ‌న సినిమా పాట‌లో ఒక లైన్ ఉంటుంది తీరుస్తారా బాధ తీరుస్తారా..అని! అవును ! ఆనంద్ సినిమా వేటూరి లాంటి గొప్ప వాడు పాట‌లు రాశారు. స‌ర్ ! నేను అన్ని డ‌బ్బులు ఇచ్చు కోలేను కానీ మీరు మాత్ర‌మే రాయాలి ఈ పాట‌లు. క‌థేంటో చెప్పండి త‌రువాత మిగ‌తావ‌న్నీ మాట్లాడ‌దాం.


అలా ఆయ‌న క‌థ విన్నారు. శేఖ‌ర్ కు జీవితాంతం గుర్తు పెట్టుకోదగ్గ సాహిత్యం ఇచ్చారు. ఇదిగో నా పాట మీ జీవితాన్ని మారు స్తుంది అని కూడా చెప్పి పంపారు. అంత స్థాయిలో ఈ రోజు ఆయ‌న ద‌గ్గ‌ర లిరిసిస్టులులేరు. ఏదో రాస్తున్నారు అంతే! ఆయన కూ డా ఇదే అనుకోవాలి అనుకుంటున్నాడు కూడా! ఎంత గొప్ప విష‌యం ఒక రోజు ఆయ‌న ఒంట‌రిగా న‌డిచి త‌న సినిమా అమ్ముడు పోతే చాలు ఈ క‌ష్టాలు గ‌ట్టెక్కితే చాలు అనుకున్నాడు. ఇ ప్పుడు స్టార్ హీరోలు కూడా స‌ర్ నేను మీతో ఓ సినిమా చేయాల‌నుకుం టున్నాను అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయ‌న జీవితంలో ఎంతో ఉన్న‌తి ఇది. అనూహ్య మార్పు ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: