అతడి వల్ల తమన్నా అనారోగ్యానికి గురైందట..

Purushottham Vinay
టాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోస్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. తన మత్త్చెక్కించే అందాలతో యూత్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది.ఇక హీరోయిన్ లు అన్నాక ఎక్కువ కాలం తమ హాట్ నెస్ తో ఆకట్టుకోడానికి అలాగే సినిమా అవకాశాల కోసం ఎప్పుడు కూడా ఫిట్ గా, ఆరోగ్యంగా అందంగా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సార్లు అతి జాగ్రత్త వల్ల వారు ఆనారోగ్యాలకు గురవ్వుతూ వుంటారు. ఇక తాజాగా తమన్నా కూడా తనకున్న అనారోగ్య సమస్యల గురించి  వెల్లడించడం జరిగింది. అందం కోసం తన ఆహారపు అలవాట్లు ఇంకా జిమ్ లో అతిగా వ్యాయామం చేయడం వల్ల ఆకారణంగా ఎక్కువగా ఒత్తిడి కి గురవ్వడం జరిగిందట. ఇక తమన్నాకి ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందట. కానీ ఎప్పుడూ కూడా మిల్కీ బ్యూటీ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక ఇప్పుడు ఏమైందో ఏమో తనకు చెప్పాలనిపించి చెప్పానని తెలిపింది.

ఇక ఇలా ఎందుకు జరిగిందంటే తన డైటీషన్ కారణంగానే తమన్నా పాపం ఇంతలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపడం జరిగింది.తన కెరీర్ ఆరంభంలో సరైన డైటీషన్ ని ఎంపిక చేసుకోలేదని వెల్లడించడం జరిగింది.అతని చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోని అనారోగ్యానికి గురయ్యాను అని చెప్పింది. ఇక ఇప్పుడు అయితే అంతా సెట్ అయింది. ప్రస్తుతం ఆహారం తీసుకోవడంలో చాలా మార్పులు చేసానని తెలిపింది. ఇక ఎక్కువగా లిక్విడ్ఫుడ్ తీసుకుంటున్నాను. అలాగే పళ్లు తింటున్నాను. ఇంకా సేంద్రీయ ఆహారం కూడా తీసుకుంటున్నాను. ఇక వేపుళ్లకు చాలా దూరంగా ఉంటున్నాను. అలాగే అవసరం మేర మాత్రమే వ్యాయామాలు చేస్తున్నానని తమన్నా తెలిపడం జరిగింది.ఇక  ఇటీవలే తమన్నా నటించిన `సీటిమార్`ఇంకా `మాస్ట్రో` సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మిల్కీ బ్యూటీ `ఎఫ్ -3`..`గుర్తుందా శీతాకాలం`  సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: