120 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటీమణి కరాటే కళ్యాణి. హరికథ కళాకారిణిగా ఎంతో మంచి పేరు దక్కించుకుని కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉంది. ఇక సుదీర్ఘకాలం హరికథ చెప్పినందుకు గానూ ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది. గంటల 45 నిమిషాల 55 సెకండ్లు హరికథ చెప్పినందుకు ఈ రికార్డ్ సాధించింది కరాటే కళ్యాణి.
విజయనగరంలోని కళ్యాణనంద భారతి పాఠశాలలో చదువుతున్న సమయంలోనే హరికథ చెప్పడం లో ఈమెకు ఆసక్తి కలిగింది. అలా హరికథ చెప్పడం మొదలు పెట్టిన ఈమె 2001లో సినిమా పరిశ్రమకు నటి గా పరిచయం అయింది. హీరోయిన్ స్నేహితురాలుగా ఆమె వేచి ఉంటా అనే సినిమాలో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకున్నారు. ఈమె నటించిన కృష్ణ, చత్రపతి సినిమాలు ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా వ్యాంప్ పాత్రలకు ఎక్కువగా రాగా ఆ పాత్రకు ఆమె ఎక్కువ గా చేసింది. ముఖ్యంగా గా ఆర్టిస్ట్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఈమె నటిగా కంటే వివాస్పద నటిగానే ఎక్కువగా ప్రజల నోళ్లలో నానింది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో ఈమె పేరు ఎక్కువగా వినపడింది. శ్రీ రెడ్డి మరియు ఈమెకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది అని చెప్పాలి. ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి ఆపద ఇబ్బంది వచ్చినా ఈమె ముందు ఉండి పోరాడుతుంది. మా ఎలక్షన్ సమయంలో కూడా ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు చేయడం తక్కువే అయినా ఇలాంటి వివాదాల్లో ఎక్కువ పేరు వినబడుతుంది. ఏదేమైనా నా ఏదో ఒక ఇష్యూ ద్వారా ఈమె ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. టీవీ ఛానల్ లలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది.