ఊహించని సూపర్ హిట్.. రౌడీ హీరో@100 కోట్లు?
స్టార్ హీరోల సినిమాలు సైతం 100 కోట్ల మార్కును అందుకోవడానికి ఎన్నో రోజులు పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు మాత్రమే కాదు ఎంతో మంది యువ హీరోల సినిమాలు కూడా సులభంగా 100 కోట్ల మార్కును అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు వరకు స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల మార్కును అందుకోవడం చూశాము.. కానీ అసలు సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెర మీదికి వచ్చి.. అప్పటికి పూర్తి స్థాయి స్టార్ హీరోగా ఎదగని విజయ్ దేవరకొండ.. నటించిన గీత గోవిందం సినిమా అంచనాలకు మించి హిట్ అయింది ఇక ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరి పోయాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమా కి ముందు విజయ్ దేవరకొండ చేసినవి కొన్ని సినిమాలే.. అందులో హిట్ అయినవి కొన్ని సినిమాలు. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా నటించిన విజయ్ దేవరకొండ గీత గోవిందం లో ఎంతో డీసెంట్‌గా కనిపించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం రిసీవ్ చేసుకున్నారు. విజయ్ కీ ఇది ఒక సహజమే అయినప్పటికీ సాహసమే ఏకంగా విజయ్ దేవరకొండ ను వందకోట్ల క్లబ్ లో చేర్చింది.