శేఖర్ కమ్మల సినిమాలంటే సాధారంగా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఆయన తీసిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు జీవితంలో ఎక్కడో ఒక దగ్గర కనెట్ట్ అయ్యిందనే భావన వస్తుంది. శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన హ్యాపిడేస్ సినిమా ఇంజనీరింగ్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ కు కనెక్ట్ అవుతుంది. అందులో ఫ్రెండ్స్ మధ్య ఉండే సంభాషణలు..గొడవలు ప్రేమలు అన్నీ తమ లైఫ్ లోనూ ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక ఆనందర్ మంచి కాఫీ లాంటి సినిమా..గోదావరి సినిమా, లై ఈజ్ బ్యూటిఫుల్ కూడా అలాగే ఉంటాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఓ రిచ్ కాలనీ పక్కకు మిడిల్ క్లాస్ వాళ్లు నివాసం ఉంటే ఎలా ఉంటుంది. వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదానిని క్లారిటీగా చూపిస్తుంది.
అదే విధంగా గోదావరి సినిమా కూడా అంతే జర్నీలో ఓ అమ్మాయి పరిచయమైతే..ఆ అమ్మాయితో యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే సినిమా కథ. ఇక అలా జర్నీలో పరిచయాలు ప్రేమలు కూడా నిజ నీజ జీవితం లో కనిపిస్తుంటాయి. ఇక శేఖర్ కమ్మల ఫిదా సినిమా కూడా అలాంటిదే. పల్లె టూరిలో ఉండే అమ్మాయి తన బావ తమ్మడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ కూడా. అయితే ఇప్పుడు మరో సినిమా లవ్ స్టోరీ తో శేకర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే లవ్ స్టోరీ టీజర్ ట్రైలర్ లు విడుదల చేయగా తెలంగాణ యాసలో ఆకట్టుకున్నాయి. ఇద్దరి కులాలు వేరు కావడం కెరీర్ లో సెటిల్ అవ్వడానికి ఇద్దరూ కష్టపడటం కనిపిస్తుంది. అయితే ఈ సినిమాపై ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను రాష్ట్రంలో సంచలనం రేపిన మిర్యాల గూడ పరువు హత్యను బేస్ చేసుకుని తెరకెక్కించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ప్రేమ పెళ్లి గురించి ఎమోషనల్ డైలాగులు ఉన్నాయి. అయితే అవి వట్టి రూమర్లేనని లవ్ స్టోరీ మేకర్స్ అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.