ప్రభాస్ కార్ వ్యాన్ కు అంత ప్రత్యేకత ఏమిటో..?
నిజానికీ షూటింగ్ సమయంలో నిర్మాతలే ఆ హీరోలకు అత్యంత విలువైన కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. కానీ కాలక్రమేణా ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుని మరీ షూటింగ్ సమయంలో వాటికి అద్దెలు కూడా ..నిర్మాతల దగ్గర నుండే వసూల్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాజాగా ఓ కార్ వ్యాన్ ను , తన అభిరుచికి తగినట్టుగా.. ఆ కార్ వ్యాన్ లో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దీనిని డిజైన్ చేయించుకొని మరీ కొనుగోలు చేశాడట.
ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఈ కార్ వ్యాన్ లో సహజసిద్దమైన వెలుతురు వచ్చే ఒక సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ వెలుతురు కాకుండా సహజ సిద్దమైన వెలుతురును ఆస్వాదించేందుకు ఈ కార్ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నారట ప్రభాస్. ఈ విషయాన్ని ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓం రౌత్ ఇటీవల తెలియజేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు డబ్బుల వున్న వారు ఏమైనా చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.