ఫోటో తీస్తే ఫోన్లు పగలగొట్టుడే.. వార్నింగ్ ఇచ్చిన బన్నీ?

praveen
అలా వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ తన సక్సెస్ఫుల్ దర్శకుడు సుకుమార్ తో కలిపి సినిమా చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్.  ఇక పుష్ప సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన పాటలు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులందరిలో మరింత అంచనాలు పెంచేసింది.

 సాధారణంగానే సుకుమార్ సినిమాలో ఊహించినంత కాలిక్యులేషన్స్ ఉంటాయి..  ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు ఆశ్చర్య పరుస్తూ ఉంటారు..  ఇక ఈ సారి డిఫరెంట్ కథ కావడంతో ఇక ఏ రేంజిలో ఉండబోతుందో అని అటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ మారేడుపల్లి అడవుల్లో జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  ఇక పోతే  ఈ సినిమా ప్రారంభమైన నాటినుంచి పుష్ప సినిమాకు లీకుల బెడద ఎక్కువ అవుతూ వస్తుంది.  సినిమా సన్నివేశాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో ఎంతోమంది లీక్ చేస్తున్నారు.

 ఇప్పటికే సినిమా లోని పలు సన్నివేశాలు లీక్ అయ్యాయి.  అదేఅయితే సినిమా షూటింగ్ దగ్గరికి అల్లు అర్జున్ ని చూడడానికి ఎంతో మంది అభిమానులు రావడం ఇక ఫోన్ లో వీడియోలు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు వీడియోలు తీసినచో సెల్ఫోన్లు పగలగొట్టబడును అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేసింది. ఇలా పెడితే అక్కడికి వచ్చిన అభిమానులు ఫోటోలు వీడియోలు తీయకుండ ఉంటారు అని చిత్రబృందం భావించింది. కానీ అభిమానులు వింటారా ఎంత చెప్పినా ఫోటోలు వీడియోలు మాత్రం తీయడం ఆపటం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: