చిరుతో బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న దర్శకులు
ఆ విధంగా చాలా మంది దర్శకులు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసి భారీ రెమ్యునరేషన్ అందుకోవడం త పాటు పెద్ద పాపులారిటీని దక్కించుకున్నారు. అయితే చిరంజీవితో సినిమా చేసే అవకాశం కాళ్ల దగ్గరికి రాగా దాన్ని కాలదన్నారు ఓ ఇద్దరు దర్శకులు. మరి ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? ఎందుకు ఆ విధంగా ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ శివ సినిమా చేసి వరుస హిట్లు చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరి ఆయనతో ఓ సినిమా చేయాలని ఆఫర్ ఇవ్వగా రాంగోపాల్ వర్మ చేజేతుల ఆ ఆఫర్ ను నాశనం చేసుకున్నాడు. వినాలని ఉంది అనే సినిమా ను ప్రకటించి హీరోయిన్ గా రంగీలా ను తీసుకున్నారు. రెండు పాటలను కూడా చిత్రీకరించారు. అయితే అప్పటికే సంజయ్ దత్ తో ఓ సినిమా చేస్తున్న వర్మ అరెస్ట్ అవ్వడం తో చిరంజీవితో సినిమాను ప్లాన్ చేశారు. అయితే బెయిల్ మీద బయటకు రావడంతో ఆ సినిమాను తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది వర్మ కి. దాంతో సారీ చెబుతూ చిరంజీవి సినిమా ను క్యాన్సిల్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణం లో ఓ భారీ చిత్రాన్ని చేయాలని షూటింగ్ మొదలు పెట్టగా ఆ సినిమా అభిప్రాయ భేదాలు వచ్చి మధ్యలో నే పక్కన పెట్టేశారు.