వినాయకచవితి విజేత పై పెరిగిపోతున్న ఆశక్తి !
కరోనా ఫస్ట్ వేవ్ తరువాత విడుదలైన చాల సినిమాలు హిట్ అయ్యాయి. ‘ఉప్పెన’ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమాలకు వచ్చిన స్పందన చూసి సినిమాలకు ఎదురు లేదు అని అంతా అనుకున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కొక్కటిగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా జనం పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఓటీటీ ని పక్కకు పెట్టి జనం థియేటర్స్ కు వైపు రాకపోవడంతో కలెక్షన్స్ ఈమాత్రం రావడంలేదు. దీనితో రిలీజ్ కు రెడీగా ఉన్న సుమారు 30 సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటివరకు థియేటర్స్ లో సరైన మాస్ సినిమా విడుదల కాకపోవడంతో తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అన్న అంచనాలు ఎర్పడాయి.
దీనితో ఈవారం విడుదలకాబోతున్న ‘టక్ జగదీష్’ ‘సిటీమార్’ సిమాల మధ్య పోటీ అత్యంత ఆసక్తి దాయకంగా మారింది. వినాయకచవితి రోజున ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది. అయితే అదేరోజున థియేటర్లలో ‘సీటీమార్’ సినిమా సందడి చేయబోతుంది ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనడం కంటే థియేటర్ ఓటీటీ మధ్య పోటీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ‘టక్ జగదీష్’ చూడడానికి ఇంట్రస్ట్ చూపిస్తే మాస్ ప్రేక్షకులు ‘సిటీమార్’ కోసం థియేటర్స్ కు వస్తారు అని అంచనా. అయితే అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా అన్నది వినాయకచవితి రోజున తేలిపోతుంది. అదేరోజున వస్తున్న ‘సీటీమార్’ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘కబడ్డీ’ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్ పాటలు సగటు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈసినిమా తనకు తప్పక హిట్ ఇస్తుందని గోపీచంద్ ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఈ అంచనాలే నిజం అయితే ఈమూవీ ఇచ్చిన ధైర్యంతో మరన్ని సినిమాలు ధియేటర్లలోకి వచ్చే ఆస్కారం ఉంది..