అప్పుడు గోపి.. ఇప్పుడు తమన్.. ఏంటి ప్రాబ్లమ్!!

P.Nishanth Kumar
కొన్ని కొన్ని సార్లు సినిమా పరిశ్రమలో ఒకరు చేయవలసిన పని మరొకరు చేస్తూ ఉంటారు. సినిమా మొదలైనప్పుడు ఉన్నవారు సినిమా పూర్తి అయ్యేటప్పుడు ఉండరు. ఆ విధంగా సంగీత దర్శకులు కూడా కొన్ని కారణాలతో సినిమా మధ్యలోనే మారుతూ ఉంటారు. అలా గోపీ సుందర్ మరియు తమన్ లాంటి అగ్ర సంగీత దర్శకుల మధ్య ఓ ఆసక్తికర విషయం జరిగింది. అదేమిటంటే గోపీసుందర్ తాను సంగీతం అందించిన సినిమాకి మధ్యలోనే వెళ్లగా అలా ఆయన మొదలుపెట్టిన పనిని తమన్ పూర్తి చేశాడు.

తాజాగా తమన్ మొదలుపెట్టిన ఓ సినిమాని గోపీసుందర్ ముగించడం విశేషం.  ఇక్కడ విచిత్రమేమిటంటే వీరిద్దరూ పనిచేసిన ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కడే కావడం విశేషం. ఆయన ఎవరో కాదు శివ నిర్వాణ. నిన్ను కోరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ చిత్రాల ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా మంచి పాపులారిటీ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన మజిలీ చిత్రం కూడా సూపర్ ట్ కావడంతో తెలుగు కి మరొక ఫీల్డ్ డైరెక్టర్ దొరికాడు అని అందరూ ఎంతో ఆనంద పడ్డారు.  అయితే ఆయనకు సంగీత దర్శకులను మెయింటెన్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంది అని ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి తెలుస్తుంది.

నిన్నుకోరి సినిమా తర్వాత ఆయన చేసిన మజిలీ సినిమా సంగీత దర్శకుడిగా గోపీసుందర్ ఎంపిక కాగా ఈ సినిమా విడుదల సమయంలో ఆయనను కాదని మిగతా పనులు తమన్ తో చేయించుకున్నారు చిత్రబృందం. అలా తమన్ తో మంచి కెమిస్ట్రీ కుదిరింది అనుకొని శివ నిర్వాణ ఆయనతో తన తదుపరి సినిమా టక్ జగదీష్ ను మొదలు పెట్టగా ఆ సినిమా మొదలైనప్పుడు తమన్ అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కానీ ఇప్పుడు గోపీసుందర్ లైన్ లోకి రావడం అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరుస్తుంది. తమన్ ఈ సినిమా నుంచి తప్పుకోగా మిగిలిన సంగీత పనులు గోపి సుందర్ చేసి లెక్క సరి చేశాడు. అలా  తమన్ చేసిన పనిను ఇప్పుడు గోపి సుందర్ పూర్తి చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: