ఢీ అంటే ఢీ అంటున్న బన్నీ.. రౌడీహీరో..!
హీరోలు డైరెక్ట్ గా వార్ కు దిగకపోయినా.. కెరియర్ విషయంలో పోటీ కామనే. అలానే విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనే పట్టుదలతో దూసుకెళ్తున్నారు. గత కొంతకాలంగా జోరుగా ముందుకెళ్తున్న విజయ్ దేవరకొండ జోరుకు అల్లు అర్జున్ కళ్లెం వేసేశాడు. పుష్పతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇండియాలో దిబెస్ట్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాడు అల్లు అర్జున్.
నిన్న.. మొన్నటి వరకు సోషల్ మీడియాలో విజయ్‌దేవరకొండ తన హవా చూపించాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బన్నీ లాంటి స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు దాటినా.. సోషల్‌మీడియాలో రౌడీ హీరోను టచ్ చేయలేకపోయారు. తెలుగులోనే కాదు దక్షిణాదిలోనూ ఏ హీరోకూ లేని రికార్డ్ విజయ్ సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాలో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా దక్షిణాదిన రికార్డ్ నిన్నటి వరకు రౌడీ హీరో పేరు మీదే ఉండేది.
పెళ్లి చూపులు.. అర్జున్‌రెడ్డి.. గీత గోవిందం హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ గ్రాఫ్ లిఫ్ట్‌లో పైకి వెళ్లిపోయింది. మధ్యమధ్యలో ఫ్లాప్స్ వచ్చినా.. ఆ ప్రభావం క్రేజ్‌పై పడనంతగా పాపులర్ అయ్యాడు ఈ యంగ్ హీరో. యూత్ ఐకాన్‌గా నిలిచి ఫాలోవర్స్‌ను సంపాదించాడు. ప్రస్తుతం 12.9 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. ఈ రికార్డ్‌ను బన్నీ 13 మిలియన్ అనుచరులతో బ్రేక్ చేశాడు.
ఇన్‌స్టాలో ఫాలోవర్స్ సంపాదించే యుద్ధం చాలాకాలంగా బన్నీ, విజయ్ మధ్యే నడుస్తోంది. 12.9 మిలియన్ ఫాలోవర్స్‌తో ఉన్న విజయ్ 13 మిలియన్స్ ఉన్న బన్నీని దాటేయొచ్చు. ఇన్‌స్టాలో రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి దరిదాపుల్లో మరో హీరో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇన్‌స్టా ఫాలోవర్స్ రేసులో విజయ్‌దేవరకొండ, బన్నీ తప్ప మరో హీరో లేడు. 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో మహేశ్ మూడో స్థానంలో ఉన్నాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు 6.9 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఈ విషయం తెలిసి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.