అఖండ రిజల్టే బన్నీ తో సినిమా డిసైడ్ చేసేది!!

P.Nishanth Kumar
బోయపాటి శ్రీనుకు ఇప్పుడు పెద్ద అగ్నిపరీక్ష ఎదురయ్యింది. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను చేసి టాప్ హీరోలను సైతం వెయిట్ చేయించుకున్న ఘనత ఆయనది. అలాంటి దర్శకుడి కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒక్కటంటే ఒక్క సినిమా ఆయన ను ఆయనతో సినిమాలు చేసే హీరోలను అయోమయంలో పడేసింది. రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్ద గా మెప్పించలేకపోయింది.

నిజానికి ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని తాలూకా క్రెడిట్ హీరో దర్శకుడికి ఇద్దరికీ వెళుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగాభిమానులు బోయపాటి శ్రీను దే మొత్తం తప్పు అన్నట్లు గా వ్యవహరించారు. ఆ సినిమా వల్ల ప్రేక్షకులలో కూడా బాగా బ్యాడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మరొకసారి తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తాను పెద్ద హిట్ సినిమాలను అందించిన హీరో బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు.  ఇది తనకు హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా పోయిన పేరు కూడా తీసుకు వస్తుందని భావిస్తున్నారు.

ఇక ఆయన ఈ సినిమా తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అని అప్పట్లో ప్రచారం జరగగా బోయపాటి శీను ఉన్న పరిస్థితి చూసి అప్పుడు అల్లు అర్జున్ తన సినిమా రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖండ సినిమా ఏమాత్రం అటూ ఇటూ అయినా బోయపాటి శ్రీను కెరీర్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అఖండ బాగుంటే ఓకే లేదంటే మరో హీరో తో హిట్ సినిమా చేయాలి.  అలా చేస్తే బోయపాటి శ్రీను ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా వచ్చిన స్టార్డమ్ అంతా  వృధా అయిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: