పవన్ అంటే పవర్ : దేశం కన్నా ఎక్కువ కాదు!
నిజ జీవితంలో రంగులు ఉంటాయి
కానీ అవి నిజాయితీతో ఉంటాయి
కల్మషం లేకుండా ఉంటాయి
అన్నది కొందరికే
జాతీయతను పెంపొందించే పనులు ఓ సినిమా హీరో చేస్తాడా? అసలు ఓ సినిమా హీరోకు దేశం అంటే ఉండే ప్రేమ ఎంత? భక్తి ఎంత? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే పవన్ అడ్డు పడతాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆ యనే ఉదాహరణగా నిలుస్తాడు. దేశం కన్నా నేనేం పెద్దవాణ్ని కాదు అండి..ఈ దేశం సంస్కృతిని ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఇంతవాణ్ని అయ్యాను..నేను నేలను ప్రేమిం చాకనే కదా! ఈ దేశం గొప్పదనం ఒకటి తెలిసింది..నేను వీ రులను ప్రేమిస్తాను..వీరులను అందించిన తల్లులకు రుణపడిపోయాను అని కూడా అం టారు ఓ సందర్భంలో! అందుకే ఆయన ప్రసంగం చివర్లో జై హింద్ అన్న ఒక్క మాట ఎందరికో స్ఫూర్తి. దేశం అంటే విద్వేషాలకు సహ కరించే మనుషులను నిలువరించడం..దేశం అంటే సమూహంగా ఉండే సంస్కృతిని గౌరవించడం.. పవన్ సంస్కృతిని గౌరవించి పెద్దవాడు అయ్యాడు..మతాలను గౌరవించి మానవతను చాటాడు. మాస్టార్జీ అనే రైటర్ జానీ సి నిమాలో ఓ మాట రాశారు .. విని పొంగిపోయాడు..మనుషులంత ఒక్కటంది శాస్త్రమన్నా మనుషుల్లో సైతానుకిది పట్టదన్నా అని!
దేశాన్ని పీడించే శక్తులను నిలువరించే శక్తి ప్రతి ఒక్కరికీ ఉండాలి. దేశ భక్తి..ప్రభు భక్తి వేరు కాదు. దేవుడు సృష్టిని నేను నమ్ము తాను.. ఆ సృష్టిలో అసమానతలు లేవు..మనం తెచ్చి పెట్టాం అని అంటారు పవన్.. నేను అ సమానతలను ద్వేషిస్తాను.. మను షులను ప్రేమిస్తాను. సమగ్రత, ఐక్యత అన్నవి ఓ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దేశాన్ని ప్రేమించే శక్తులకు మాత్రమే ఇవి అర్థం అవుతాయి. పవన్ వీటిని అర్థం చేసుకుంటారు. ప్రాం తా లకు అతీతంగా సంస్కృతిని ప్రేమిస్తారు. పల్లెలను ప్రేమించి, మట్టి మూలా లను తెలుసుకుంటారు. వెనుకబాటు తనం కారణంగా నిత్యం సమస్యలు చవిచూస్తున్న శ్రీకాకుళంతో సహా ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయల సీ మ జిల్లాలు, తెలంగాణ పల్లెలు అభివృద్ధి సాధిస్తే ఆనందిస్తారు. దేశాన్ని ప్రేమించడంలో పల్లెల అభివృద్ధిని ఆశించడంలో ఈ సినీ హీరో అందరి కన్నా ముందుంటాడు. సినిమావాళ్లు కదా ఇంత ఆలోచిస్తారా అని మాత్రం అను కోవద్దు..