సుకుమార్ .. శ్రద్ధా దాస్ కు పెట్టిన పేరు ఏంటో తెలుసా..?

Divya
సుకుమార్ కు సినీ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ అనే పేరు కూడా ఉంది.. ఈయన సినిమాలు అన్ని చాలా డిఫరెంట్ గా విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి కాబట్టి ప్రేక్షకులు సుకుమార్ కు ఆ పేరు పెట్టారు. ఉదాహరణకు నాన్నకు ప్రేమతో అనే సినిమాలో సుకుమార్ టాలెంట్ ని మనం చక్కగా చూడవచ్చు.. సుమారుగా కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు తీసి, మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అంతేకాదు హీరోల కెరియర్లో కూడా మంచి మంచి సినిమాలను అందించాడని చెప్పవచ్చు.


ఇకపోతే శ్రద్ధా దాస్.. కేవలం నటి మాత్రమే కాదు గాయని అలాగే మోడల్ కూడా.. తెలుగు, హిందీ, మలయాళం, బెంగాలీ చిత్రాలలో నటించి , మంచి గుర్తింపు పొందింది. మొదటిసారిగా 2008వ సంవత్సరంలో సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక 2009 వ సంవత్సరం లో 18 , 20 లవ్ స్టోరీ , అధినేత, లక్ష్యం, ఆర్య టు వంటి సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ .ముఖ్యంగా రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను అలరించే శ్రద్దాదాస్, ఈమెకు అన్ని భాషలలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..


2010వ సంవత్సరంలో రెండు హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత డార్లింగ్ , నాగవల్లి వంటి సినిమాలతో నటించి మెప్పించింది.. అయితే ఇక అసలు విషయానికొస్తే ,శ్రద్ధ ఇటీవల రాశి, మహేశ్వరి, సదా తో కలిసి సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం కు హాజరయ్యింది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల కావడంతో ఇందులో సుకుమార్, శ్రద్ధాదాస్ కు ఒక పేరు పెట్టారని ఆమె తెలిపింది.. ఏమిటంటే , అల్లు అర్జున్ తో ఆర్య 2 సినిమా తీస్తున్న సమయంలో, ఆ సినిమాకు డైరెక్టర్ సుకుమార్. ఒక్క చిన్న మాట అన్న సరే ఆమె వెంటనే గడగడ ఏడ్చేయడంతో సుకుమార్ ఆమెకు వాటర్ టాప్ అని పేరు పెట్టాడట.

అంతేకాదు ఈ మధ్య ఎప్పుడైనా ఎదురుపడ్డ కూడా.. వాటర్ టాప్అనే పిలుస్తాడు అని శ్రద్ధాదాస్ చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: